చార్మిని కూడా ఓ పట్టుపడుతున్న నాగార్జున...
నాగార్జున సరసన చార్మి తాజాగా ఓ ఐటం సాంగ్ చేయటానికి కమిట్ అయింది. వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ఇప్పటికే ప్రియమణి, అనూష్క హీరోయిన్స్ గా చేస్తున్నారు. వీరు చాలదన్నట్లు చార్మిని నాగార్జున ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. ఇక చివరి నిముషంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినిమా మొదటి ఇంట్రడక్షన్ సాంగ్ లో అమలు పరచనున్నారు. తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన మాస్ ట్యూన్స్ ని రాయలసీమ స్లాంగ్ లో సాంగ్ గా సమకూర్చి..చార్మిని ఓ పట్టుపడుతూ నాగార్జున చిందులేస్తారు. ఇక ఈ పాటలకి రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు. చార్మి కూడా కాస్త తగ్గి ఈ పాటలో తన అందాలను ఆరబోయనుంది. ఇక చార్మి ఇంతకు ముందు మాస్ సినిమాలో నాగార్జునని మెప్పించింది. ఇక ఈ కొత్త చిత్రానికి రగడ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
చార్మి నాగార్జున రగడ మాస్ వీరూ పోట్ల అనుష్క ప్రియమణి charmi nagarjuna mass veeru potla anushka priyamani


Click it and Unblock the Notifications