పవన్ కళ్యాణ్ దర్శకుడి చెంప చెల్లుమనిపించిన చార్మి?
హైదరాబాద్: హీరోయిన్ చార్మి గురించి సంచలన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వార్తలో నిజమెంత? అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం హీరోయిన్ చార్మి ఓ ప్రముఖ దర్శకుడి చెంప చెల్లుమనిపించినట్లు తెలుస్తోంది.
ఇటీవల సదరు దర్శకుడిని కలిసేందుకు చార్మి వెళ్లిందని.... అయితే అతను ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో తిక్క రేగిన చార్మి అతని చెంపపై కొట్టిందని అంటున్నారు. సదరు దర్శకుడు నిషాలో ఉండటం వల్లనే అలా ప్రవర్తించాడని, అతని ప్రవర్తన చెడుగా ఉండటం వల్లనే చార్మి అలా చేసినట్లు చర్చించుకుంటున్నారు.
సదరు దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే సూపర్ విజయం సాధించిన ఓ చిత్రానికి దర్శకత్వం వహించాడని, ఆ చిత్రంతో అతని దశ తిరిగిందని, ప్రస్తుతం మరో టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు. ఈ విషయంలో నిజా నిజాలు వెల్లడైన తర్వాత సదరు దర్శకుడి పేరు బయటకు రానుంది.
విషయం బయటి పొక్కితే దర్శకుడి పరువు పోయే అవకాశం ఉండటంతో పాటు.... అతని సినీ కెరీర్‌కి నష్టం వాటిల్లో అవకాశం ఉండటంతో పరిశ్రమలోని కొందరు పెద్దలు ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు టాక్. త్వరలోనే అన్ని విషయాలు బయటకు రానున్నాయి... పూర్తి వివరాల కోసం వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications











