చార్మికి గత కొంత కాలంగా ఫ్లాపులు రావటం లో ఆమె మార్కెట్ తగ్గటం మొదలైంది. అందుకు తగ్గట్లుగానే ఆమె కాస్త కొత్త దర్శక, నిర్మాతలను దొరికితే వేపుకుతింటోందని పేరు వచ్చి ఆ కాస్త ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. మంగళతో మంగళం పాడకుండా ఉంటేనే ఆమె కెరీర్ కంటిన్యూ అయ్యే సిట్యువేషన్ ఉన్న ఈ స్ధితిలో ఆమె సైడ్ బిజినెస్ కి దిగిపోతోంది. ఈ షాప్ పేరు చార్మి షాపింగ్ మాల్. హైదరాబాద్ లో ఆమె ఈ వ్యాపారం ప్రారంబించటానికి సరైన స్ధలం అన్వేషిస్తోందని తెలుస్తోంది. ఫేడవుట్ అవుతున్న హీరోలు పబ్ లు, క్లబ్ లు అవీ పెట్టుకుని బ్రతుకుతున్న నేపధ్యంలో ఆమెకి ఈ ఆలోచన వచ్చిందని చెప్తున్నారు. ఇక బట్టలు అందులో ముఖ్యంగా శారీలు అమ్మకం తో ఈ బిజెనెస్ ప్రారంభించి పెద్ద మాల్ గా దీన్నీ విస్తరించాలని ఆమె ప్లాన్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ బిజెనెస్ కి సంభందించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.