చార్మింగ్ హీరోయిన్ కి ఇదే లాస్ట్ లైఫ్ లైన్ లేదంటే డెడ్ లైనే
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న 'బుడ్డా' సినిమాలో చార్మీ కూడా నటిస్తోంది. మొన్నోరోజు షూటింగులో దర్శకుడు జగన్ తో తను తెలుగులో మాట్లాడుతుంటే, అమితాబ్ సీరియస్ గా చూసి, 'ఇక్కడ ప్రాంతీయతత్వం వద్దు. అందరూ హిందీలోనే మాట్లాడాలి" అన్నాడట. ఈ విషయం గురించి చార్మీ చెబుతూ, 'అమిత్ జీ అలా సీరియస్ గా మాట్లాడుతూనే భలే జోక్స్ వేస్తారు. ఈ సినిమా షూటింగులో నన్నెంతో ఎంకరేజ్ చేశారు. టేక్ కి వెళ్లే ముందు ప్రతి సారీ 'ఓసారి.. రీహార్స్ చేద్దాం' అంటూ భయం పోగొట్టేవారు. ఆయనతో చేయగలగడం నా అదృష్టం" అంటోంది. ఇంతకీ, మరి సెట్స్ లో తెలుగులో మాటాడ్డం మానేశావా తల్లీ? అనడిగితే, 'లేదు... హిందీలో స్టార్ట్ చేసినా మళ్లీ తెలుగులోకే వెళ్ళిపోయేదాన్ని" అంది చార్మి నవ్వేస్తూ.
ఇప్పటికీ పాతికేళ్లు నిండని కుర్ర పిల్లనే అని ఛార్మి ఎంతగా నొక్కి చెబుతున్నా కానీ ఆమెని ఆంటీలానే చూస్తున్న యువ హీరోలు అవకాశాలివ్వండ లేదు. దానికితోడు వచ్చిన అవకాశాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే ఛార్మికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. రీసెంట్ గా నగరం నిద్రపోతున్న వేళ చిత్రంతో మరో ప్లాప్ మూటగట్టుకున్న ఛార్మి ఇప్పుడు తన ఆశలన్నీ అమితాబ్ తో నటించిన 'బుడ్డా" మీదే పెట్టుకుంది.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'బుడ్డా" చిత్రంలో అమితాబ్ కి స్నేహితురాలిగా ఛార్మి నటించింది. స్ర్కీన్ టైమ్ అంతగా లేకపోయినా కానీ ఈ సినిమాతో బాలీవుడ్ దృష్టిని ఆకట్టుకుంటానని ఛార్మి ధీమాగా ఉంది. బుడ్డా కనుక హిట్టయితే టాలీవుడ్ లో పడ్డ ఐరెన్ లెగ్ బ్రాండ్ కూడా పోతుందని, బాలీవుడ్ లో కూడా మరిన్ని అవకాశాలొస్తాయని ఆమె ఆశిస్తోంది. మరి ఛార్మికి మిగిలిన ఈ చిట్టచివరి హోప్ నిలబడుతుందో లేక ఈ లైఫ్ లైన్ కూడా పోయి ఛార్మి కెరీర్ డెడ్ లైన్ ని దాటిపోతుందో చూడాలి...


Click it and Unblock the Notifications











