దిగజారుతున్న ఛార్మి..
వరస ఫ్లాఫుల ఓ ప్రక్క క్రుంగదీస్తుంటే అందుకు తగ్గట్లే రేటు కూడా తగ్గటం ఛార్మికి మింగుడు పడటం లేదు. అప్పటికీ అందరికి అడిగిందే తడువుగా ఎక్సపోజింగ్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అయితే మంత్ర అనంతరం ఛార్మికి ఒక్క హిట్టు లేకపోవటం, శాటిలైట్ రేటు అనుకున్నంత పలకకపోవటం ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. మరో ప్రక్క ఆమె పోటీ దారులైన మిగతా హీరోయిన్స్ తమ రెమ్యునేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఈమధ్యనే నయనతార రవితేజ 'ఆంజనేయులు' చిత్రానికి 30 రోజుల కాల్షీట్లకు 65 లక్షలు డిమాండ్ చేసి ఒప్పించుకుంటే...'అరుంధతి' తర్వాత అనుష్క రేటు కోటికి చేరిపోయింది. కానీ ఛార్మి దగ్గర కొచ్చేసరకి మాత్రం నిర్మాతలంతా బేరసారాలకు దిగుతున్నారు. నలభై లక్షలున్న ఆమె రేట్ ని పాతిక లక్షలకు దింపే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ఇక త్వరలో రిలీజ్ కానున్న 'మాయగాడు', 'కావ్యాస్ డైరీ', సై ఆట, చిత్రాల్లో ఏది హిట్టయినా తిరిగి తన హవా కొనసాగించవచ్చు..లేకపోతే మరింత దిగజారిల్సి ఉంటుంది రెమ్యునేషన్ విషయంలో...


Click it and Unblock the Notifications











