చివరకు ఛార్మి కూడా అలా...

By Staff

Charmi
ఛార్మి మాటిమాటికి డైరక్షన్ లో వేలుపెడుతోందని,తోటి నటీనటులకు సజెషన్స్ ఇస్తోందని,ఆమెను భరించటం కష్టమైపోతోందని ఫిల్మ్ నగర్ వార్త. మంత్ర సినిమాతో తన ఫొటోతోనే మార్కెట్ చేసుకునే స్ధాయికి ఎదిగిన ఛార్మిపై ఇలాంటి న్యూస్ రావటం బాధాకరమే గానీ కృష్ణ కూతురు మంజుల నటిస్తూ నిర్మిస్తున్న కావ్యాస్ డైరీ సమయంలో ఇలాంటి కారణాలే వారిధ్దరి మధ్యా పొరపొచ్చాలు రావటానికి కారణమని సమాచారం. ఆ సినిమా ద్వారా వి.కె.ప్రకాష్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు.

అతను ఓ స్కీమ్ లో వెళుతూ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని షూటింగ్ చేస్తుంటే ఛార్మి అట్లాకాదు..ఇలా చేస్తే సీన్ పండుతుందని చెప్పటం రోజూ జరిగిందిట. అతని కాన్సర్టేషన్ దెబ్బతీయటం గమనించిన నిర్మాత మంజులు ఛార్మిని లైట్ గా అలా చేయవద్దని చెప్పిందని విశ్వసనీయ సమాచారం. అయితే అది మనస్సులో పెట్టుకున్న ఛార్మి పోస్ట్ ప్రొడక్షన్ లో సహకరించక డబ్బింగ్ కి ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యే ఛార్మి సొంతంగా డబ్బింగ్ చెప్పుతున్న సంగతి తెలిసిందే. హిట్టు ఎవరి చేతయినా ఏమైనా చేయిస్తుందనటానికి ఛార్మినే ఉదాహరణ అని సీనియర్లు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X