twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ స్టార్ కాపురంలో...చార్మి చిచ్చు?

    By Bojja Kumar
    |

    నార్త్ నుంచి వచ్చి సౌత్‌లో..ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెటిలైన తారల్లో పంజాబీ భామ ఛార్మి ఒకరు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో చార్మి ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చార్మి త్వరలో ఓ ఇంటిది కాబోతోందట. కొంపతీసి దేవిశ్రీ‌తో పెళ్లికి సిద్ధం అవుతుందనుకునే...అస్సలు కాదు.

    తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌ను ఛార్మి పెళ్లి చేసుకోబోతోందట. ఇటీవల పూరి జగన్నాథ్ తీసిన 'బుడ్డ హోగా తెర బాప్" సినిమాలో ఈ ఇద్దరు కలిసి పని చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య 'సం" బంధం ఏర్పడిందని సమాచారం. ఇద్దరూ పంజాబీలే కావడంతో అభిరుచూ కలిశాయి. త్వరలోనే ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ గుసగుస.

    అయితేః సోనూసూద్‌కు ఇప్పటికే పెళ్లయింది. అతని భార్య పేరు సోనాలి. ఇదేం చోద్యమని ఎవరైనా ప్రశ్నిస్తే....అయితే ఏంటి? నయనతార ప్రభుదేవాను రెండో పెళ్లి చేసుకోవడం లేదా? శ్రీదేవి బోణి కపూర్ రెండో భార్యగా సెటిల్ కాలేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఛార్మి-సోనూసూద్‌లు జంటగా కనిపించ బోతున్నారు. మరి దేవిశ్రీ పరిస్థితి ఏంటని మాత్రం అడగొద్దు...కొన్ని బంధాలు అంతే.

    English summary
    News is that Charmy is developing a bond with Sonu Sood. It is heard that she got further close to him after the recent release ‘Buddah…Hoga Terra Baap’. As such, Sonu and Charmy are Punjabis. But then Sonu is married and his wife’s name is Sonali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X