Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ స్టార్ కాపురంలో...చార్మి చిచ్చు?
నార్త్ నుంచి వచ్చి సౌత్‌లో..ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెటిలైన తారల్లో పంజాబీ భామ ఛార్మి ఒకరు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో చార్మి ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చార్మి త్వరలో ఓ ఇంటిది కాబోతోందట. కొంపతీసి దేవిశ్రీతో పెళ్లికి సిద్ధం అవుతుందనుకునే...అస్సలు కాదు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌ను ఛార్మి పెళ్లి చేసుకోబోతోందట. ఇటీవల పూరి జగన్నాథ్ తీసిన 'బుడ్డ హోగా తెర బాప్" సినిమాలో ఈ ఇద్దరు కలిసి పని చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య 'సం" బంధం ఏర్పడిందని సమాచారం. ఇద్దరూ పంజాబీలే కావడంతో అభిరుచూ కలిశాయి. త్వరలోనే ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ గుసగుస.
అయితేః సోనూసూద్‌కు ఇప్పటికే పెళ్లయింది. అతని భార్య పేరు సోనాలి. ఇదేం చోద్యమని ఎవరైనా ప్రశ్నిస్తే....అయితే ఏంటి? నయనతార ప్రభుదేవాను రెండో పెళ్లి చేసుకోవడం లేదా? శ్రీదేవి బోణి కపూర్ రెండో భార్యగా సెటిల్ కాలేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఛార్మి-సోనూసూద్‌లు జంటగా కనిపించ బోతున్నారు. మరి దేవిశ్రీ పరిస్థితి ఏంటని మాత్రం అడగొద్దు...కొన్ని బంధాలు అంతే.