twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సినిమాలు ఫ్లాఫ్ అవుతున్నాయనే ఈ నిర్ణయం..ఛార్మి

    By Srikanya
    |

    ఛార్మింగ్ ఛార్మి ప్రస్తుతం ఏ కొత్త సినిమా ఒప్పుకోవటం లేదు. కారణం ఏమిటీ అని మీడియాతో ఆమె వివరించింది. తను ఎంతో పెద్ద హిట్ అవుతాయని నమ్మి చేసిన సినిమాలు-మనోరమ, కావ్యాస్‌డైరీ అప్‌సెట్‌ అవ్వడమే. ఆ రెండు చిత్రాలు బాగా సక్సెస్‌ అవుతాయని చార్మి ఆశించాను. కానీ ఎందుకనో అవి బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించకపోవడం నిరాశ పరిచింది చార్మి అంటున్నారు. దాంతో ఏ సినిమాలు చేయాలో, ఏవి చేయకూడదో తను సంశయంలో పడినట్లు చార్మి భావిస్తున్నార. అప్పటికీ ప్రతి రోజూ కొన్ని కథలు వింటూనే వున్నారట కానీ ఏవీకూడా నమ్మకాన్ని కలిగించనందున గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేకపోయినట్లు ఈ ముద్దుగుమ్మ చెబుతున్నారు. చార్మి నటించిన 'సై ఆట' త్వరలో రిలీజుకు సిద్ధమవుతోంది. ఆడుతూపాడుతూ చేసిన ఈ సినిమా మీద ఆమె మంచి నమ్మకమే పెట్టుకున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం ఇతర భాషా చిత్రాలమీద ఆమె మనసు లగ్నం చేస్తున్నారు. మలయాళంలో దిలీప్‌ సరసన ఓ చిత్రం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు అని చార్మి అంటున్నార. ఇక ఆమె గురువు కష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన మహాత్మ చిత్రంలోనూ ఐటం సాంగ్ చేసినా వర్కవుట్ కాకపోవటం కూడా ఆమెను ఆలోచనలో పడేసిందంటున్నారు. తన క్రేజ్ తగ్గటమా..లేక కథల సమస్యా అనేది తేల్చుకోలకపోతోందని..ఇటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్య మరింత జటిలం అవుతుందని భావించే కొంత కాలం పాటు ఏ కథా ఒప్పు కోకూడదని భావిస్తోందని చెప్తున్నార. అంతేగాక ఈమె ప్రధాన పాత్రలో చేసిన మాయగాడు చిత్రానికి బయ్యర్లు కరువవ్వటం కూడా నిర్మాతల్లో గుబులు పుట్టిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X