Akhil ఏజెంట్ మూవీ నుంచి అదిరిపోయే లీక్: ఆ ఎపిసోడ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందట

చాలా కాలం క్రితమే 'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో 'హలో' చిత్రంతో రీలాంచ్ అయ్యాడు. కానీ ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 'మిస్టర్ మజ్నూ' వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో సక్సెస్ కోసం అక్కినేని అందగాడు అఖిల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న అక్కినేని అఖిల్.. కొద్ది రోజుల క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకున్నా కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన కొత్త సినిమాను పట్టాలెక్కించేశాడు.

Chasing Scene will be Highlight in Akhil Akkineni Agent Movie

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ కాకముందే అక్కినేని అఖిల్.. సురేందర్ రెడ్డితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యంగా తయారయ్యాడు. ఇక, ఇటీవలే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆదిలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీ కావడంతో 'ఏజెంట్' మూవీలో హాలీవుడ్ రేంజ్ సీన్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ ఛేజింగ్ సీన్ ఉంటుందట. ఇది నిజంగానే ఇంగ్లీష్ చిత్రాల రేంజ్‌లో షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు మూవీ యూనిట్ త్వరలోనే ఓ దేశం వెళ్లనుందని సమాచారం. అక్కడ హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయంతో దీన్ని షూట్ చేయనున్నారని తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్' యాక్షన్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఆరంభంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను కాదని అదే పరిశ్రమకు చెందిన మమ్ముట్టిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X