చావు కబురు చల్లగా.. ఓటీటీలో మరింత కొత్తగా..
పెద్దగా అంచనాలు లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూల్ హీరోగా వెళుతున్న వారిలో కార్తికేయ ఒకరు. ఈ టాలెంటెడ్ హీరో రిజల్ట్ తో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఓ వర్గం జనాలను బాగానే ఆకట్టుకున్నాడు.
నటుడు వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ ప్రముఖులు.. కన్నీరుమున్నీరైన అభిమానులు
అయితే సినిమా అన్ని వర్గాల వారికి నచ్చలేదని తెలుసుకున్న ఈ హీరో ఓపెన్ గానే ఆ విషయాన్ని బయటపెట్టడం విశేషం. క్షమాపణ చెబుతూ నెక్స్ట్ టైమ్ మరిన్ని మంచి సినిమాలతో వస్తానని చెప్పాడు. అయితే చావు కబురు చల్లగా సినిమా ఈ నెల 23 నుంచి ఆహా ఫ్లాట్ ఫార్మ్ లో సందడి చేయబోతొంది. ఈ సినిమాతో కౌశిక్ దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.

అయితే సినిమా అంతగా కనెక్ట్ కానీ వారికి గల కారణాలపై ఇటీవల చర్చలు జరిపిన చిత్ర యూనిట్ ఒక కొత్త నిర్ణయం తీసుకుందట. సినిమాకు ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త అవసరమని, లెన్త్ ఎక్కువయ్యిందని ఫీల్ అయ్యే సీన్స్ ను కట్ చేస్తున్నారని టాక్ వస్తోంది. దర్శకుడు కౌశిక్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఓటీటీలో ఈ సినిమా వస్తే చూడాలని చాలా మంది ఆడియేన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకే వారికి సినిమా పూర్తిగా నచ్చేలా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











