బాలయ్య, వినాయక్... సీక్వెల్ అంటూ పుకారు

By Bojja Kumar

హైదరాబాద్: బాలయ్యతో 'చెన్నకేవశరెడ్డి' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వివి వినాయక్ తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'చెన్నకేశవరెడ్డి-2' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే రూమర్ ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్‌తో 'నాయక్' చిత్రం తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుందట. బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మించనున్నట్లు చర్చించుకుంటున్నారు.

2002లోనే విడుదలైన చెన్నకేశవరెడ్డి చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేక బోల్తా పడింది. అయితే అభిమానులు మాత్రం ఈ చిత్రం హిట్‌గా పరిగణిస్తున్నారు. తాజాగా రూపొందబోయే చిత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని, బాలకృష్ణను కొత్త యాంగిల్‌లో చూపించడానికి వినాయక్ ట్రై చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ప్రస్తుతం బాలయ్య 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా రవికుమార్ చావలి దర్శకత్వంలో పుప్పాల రమేష్ నిర్మాతగా ఎల్లో ఫ్లవర్స్ బేనర్‌పై రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలవుతోంది.

ఇక వివి వినాయక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో 'నాయక్' చిత్రం రూపొందిస్తున్నారు. కాజల్ అమలపాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X