చరణ్-ఉపాసన నిశ్చితార్థం ఆ కోటలో కాదు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న ఇద్దరి నిశ్చితార్థం జరుపాలని పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థ వేడుక ఉపాసన పూర్వీకులు నిర్మించిన దోమకొండ కోటలో జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ వేడుక అక్కడ జరుగడం లేదని తెలుస్తోంది. నిశ్చితార్థ సమయం నాటికి కోట మరమ్మత్తులు పూర్తికకాక పోతుండటమే ఇందుకు కారణం.
ఉపాసన పూర్వీకులకు సంబంధించిన ఈ కోట 18వ శతాబ్ధంతో నిర్మించించారు. చాలా కాలంగా కోట నిర్వహణ సరిగా లేదు. తాజాగా ఉపాసన పెళ్లి రామ్ చరణ్ తో ఖాయం కావడంతో కోటకు మరమ్మత్తులు చేసి ఇక్కడే నిశ్చితార్థం, వివాహ వేడుక జరుపాలని నిర్ణయించారు. గత కొంత కాలంగా మరమ్మత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా కోట్లు ఖర్చు చేస్తూ మొత్తం కోట రూపునే మార్చేస్తున్నారు. డిసెంబర్ 1 వరకు ఆ పనులు పూర్తయ్యే అవకాశం లేక పోవడంతో నిశ్చితార్థ వేదికను మార్చారు.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం...ఉపాసన తాత, అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌజ్ లో నిశ్చితార్థ వేడుక జరుపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తూంది. ఈ పామ్ హౌజ్ చిలుకూరు బాలాజీ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











