ఉపాసన కోసం చెర్రీ ‘ఉపవాసం’- ఈ పెద్దోళ్లున్నారే...?
మెగా తనయుడు రామ్ చరణ్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. చెర్రీ కష్టాలకు కారణం ఆయన తండ్రి చిరంజీవి, కుటుంబ సభ్యులే. మరి తనకు ఇష్టమైన లైప్ పార్టను వద్దంటూ పెద్దలు అడ్డ పడుతుంటే పెద్ద కష్టం కాకుంటే మరేమిటి?
రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసన కామినేనితో ప్రేమలో పడటం, పెళ్లికి కూడా సిద్దమైన విషయం తెలిసిందే. అయితే చెర్రీ ప్రేమకు తండ్రి చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు నో చెప్పినట్లు తెలిసింది. దీంతో చరణ్ కావాలనే ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేసి పెద్దలు అంగీకారం తెలిపినట్లు ప్రచారం చేయించాడట.
ఈ విషయంపై చిరంజీవిని ప్రశ్నిస్తే....'చరణ్ పెళ్లికి ఇప్పడే తొందర లేదు" అని సమాధానం ఇచ్చారు. చిరంజీవి ప్రకటన ద్వారా 'చరణ్-ఉపాసన" ఒక్కటవ్వడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేనట్లు స్పష్టం అవుతోంది. దీంతో తండ్రిని ఎదురించడం, అదే సమయంలో తన ప్రేమను వదులు కోవడం ఇష్టం లేక నిరసన కార్య్రక్రమాలు మొదలు పెట్టాడట చరణ్. రెండు రోజుల నుంచి ఏమీ ముట్ట కుండా ఉపవాసం ఉంటూ ఉపాసన పై తన ప్రేమను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడట.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం...వేరే కులానికి చెందిన అమ్మాయి కావడంతో చిరంజీవికి ఈ పెళ్లి ఇష్టం లేదని, తన కాపు కులానికే చెందిన అమ్మాయితోనే చరణ్ పెళ్లి జరుపాలని, తద్వారా రాజకీయంగా కాపు బలం పెంచుకోవాలని చిరంజీవి యోచిస్తున్నడట. అయితే మరి కొందరు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. చిరంజీవికి కుల పట్టింపు లేదని, ఉపాసన చరణ్ కంటే వయసులో పెద్దది కావడం వల్లనే ఆయన ఈ పెళ్లికి ఒప్పు కోవడం లేదంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతో? చరణ్ ప్రేమకు శుభం కార్డు పడేదెప్పుడో?


Click it and Unblock the Notifications











