పోస్టర్ తో అల్లు అరవింద్ కి ట్విస్ట్ ఇచ్చిన చిన్ని కృష్ణ
బద్రీనాద్ చిత్రం ద్వారా ఫేడవుట్ అయిన చిన్ని కృష్ణకు అవకాశమిచ్చిన నిర్మాత అల్లు అరవింద్.అయితే సినిమా ప్లాప్ టాక్ మొదటి రోజు మార్నింగ్ షో కే తెచ్చుకుంది. దాంతో చిన్ని కృష్ణని బద్రీనాధ్ ప్రమోషన్ కు దూరంగా పెడుతూ వస్తున్నారు అల్లు అరవింద్. ఎందుకంటే చిన్ని కృష్ణకు మైక్ ఇవ్వటం అంటే కొరివితో తల గోక్కోవటేనని, మైక్ ఎదురుగా ఉందంటే చిన్ని కృష్ణ ఏమి మాట్లాడతాడో తెలియదని, అందులోనూ టాక్ బాగోలేని ఈ టైమ్ లో అటువంటి మాటలు మరింత నెగిటివ్ నెస్ ని తెస్తాయని భావించి దూరం పెట్టాడు. అంతేగాక అతన్ని ఏ టీవీ ఛానెల్ వారు పిలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
అయితే ఇది చిన్ని కృష్ణకు గిట్టలేదు. వెంటనే ఆయన తన అభిమాని పేరట ఓ యాడ్ ఒకటి లీడింగ్ న్యూస్ పేపర్ లోనూ, పిల్మ్ నగర్ లో హోర్డింగ్ క్రింద పెట్టించాడు. అందులో అల్లు అర్జున్..చిన్ని కృష్ణకు నమస్కారం పెడుతున్నట్లు, చిన్ని కృష్ణ అనే నాలుగు అక్షరాలే కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయని రాసుకొచ్చాడు. అది ఇప్పుడు అల్లు అరవింద్ కి మండిపోతోందిట. అయితే చిన్ని కృష్ణలా బయిటపడి విషయాన్ని పెద్దది చేయటం ఇష్టం లేదని దానికి తగిన టైమ్ చూసి బుద్ది చెప్తాడని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











