twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య చిత్రం టైటిల్ 'చిన్నోడు-పెద్దోడు'

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగచైతన్య, సునీల్‌ హీరోలుగా శ్రీసాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'చిన్నోడు-పెద్దోడు' అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. మొదట ఈ చిత్రానికి 'తడాఖా' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఫన్ వచ్చే విధంగా ఉండాలని ఈ టైటిల్ ని పరిగణనలోకి తీసుకుని నాగార్జునకి తెలియచేసినట్లు తెలుస్తోంది. నాగార్జున ఓకే చేస్తే వెంటనే ఈ టైటిల్ తో ప్రకటన వస్తుందని వినపడుతోంది.

    బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో నాగచైతన్య, సునీల్‌ అన్నదమ్ములుగా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంతో పరిచయమైన పి.కిశోర్‌కుమార్‌ (డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

    ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఇందులో సునీల్‌, నాగచైతన్య అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే ఆ సోదరులు చేసే సందడి ఆకట్టుకొంటుంది''అని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలోనే ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రారంభించనున్నారు.

    ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.అందులోనూ గతంలో వచ్చిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇక వెట్టై చిత్రం యాక్షన్‌, ప్రేమ, సెంటిమెంట్‌ సమాహారంతో రూపొందింది. తెలుగు వెర్షన్ లో మిగతా కీలక పాత్రల్లో... బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్‌ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్‌, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్‌, పాటలు: చంద్రబోస్‌, సంగీతం: తమన్‌.

    English summary
    ‘Chinnodu – Peddodu’ is the title under consideration for Akkineni Naga Chaitanya and Sunil starer movie which happens to be the official remake of Tamil super hit movie, Vettai. Bellamkonda Suresh is producing this movie and P.Kishore Kumar (Dolly) is the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X