'గోవిందుడు...' ని గట్టిగానే కెలికారు
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' ఆగిపోయిందంటూ, కృష్ణ వంశీ ని తీసేస్తున్నారంటూ తెగ రూమర్స్ మీడియాలో వచ్చేసాయి. అయితే వాటిని గమనించినట్లున్నారు గోవిందుడు టీమ్. వెంటనే బండ్ల గణేష్ రంగంలోకి దిగి ఇండైరక్ట్ గా ఖండన లాంటి ప్రెస్ నోట్ ఇచ్చేసాడు. తాజా షెడ్యూల్ వచ్చే నెల 5 నుంచి అని ఖరారు చేసి పారేసాడు. అంతేకాదు చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్ వచ్చారని చెప్పాడు. మలేషియా షెడ్యూల్ కాకుండా లండన్ లో సీన్స్ ఉంటాయని అన్నాడు. ఈ హడావిడి ప్రెస్ నోట్ చూసిన వాళ్లు మాత్రం ...సినిమా ఆగిపోలేదనేది నిజమే కానీ చిరంజీవి వచ్చి మార్పులు చేసాడనేది స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు. రామ్ చరణ్ కి ఒంట్లో బాగోలేదంటూ తీసుకున్న గ్యాప్ లో ఈ మార్పులు చేసేసారన్నమాట.
ఇక ఈ చిత్రం కాన్సెప్టు ఏంటంటే... పల్లెటూరంటే... పచ్చదనం, తెలుగుదనం. మనవైన ఆప్యాయతలు, అనురాగాలూ అక్కడే కనిపిస్తాయ్. పిన్ని, పెద్దమ్మ.. బాబాయ్, నానమ్మ, తాతయ్య - ఎన్ని పిలుపులో. ఇంకెన్ని ఆప్యాయతలో. ఈ అరమరికలు లేని ఆనందాన్ని అనుభవించాలని విదేశాలనుంచి వచ్చాడో కుర్రాడు. కానీ... ఇక్కడి అనుబంధాలూ కలుషితమైపోయాయని అర్థమయ్యింది. మరి ఇలాంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దాడో, తాను కలలుకన్న ఉమ్మడి కుటుంబాన్ని తానే ఎలా నిర్మించుకొన్నాడో తెలియాలంటే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చూడాల్సిందే.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్ హీరోయిన్ . శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''ఈ షెడ్యూల్‌లో కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. అనంతరం లండన్‌లో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రకాష్‌రాజ్, జయసుధలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్ శంకర్‌రాజా ఇప్పటికే మూడు పాటల్ని రికార్డ్ చేశారు''అన్నారు.
శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











