»   » ఫ్యాన్స్‌కు ఝలక్ ఇచ్చిన చిరు: 150వ చిత్రంపై నో సస్పెన్స్..!?

ఫ్యాన్స్‌కు ఝలక్ ఇచ్చిన చిరు: 150వ చిత్రంపై నో సస్పెన్స్..!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రాబోతోందనే వార్తలు గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం.ఈ మధ్యన అందుకోసమే లైపోసెక్షన్ ఆపరేషన్ చేయించుకొని సన్నబడ్డాడని, 150వ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుగున్నాయని, డైరెక్టర్ ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదని ఆమధ్య వార్తలు వచ్చాయి. సంవత్సరం క్రితం ఒక ప్రెస్ మీట్ లో రాజకీయాలు, సినిమాలు నాకు రెండుకళ్ళులాంటివి అని చిరంజీవి చెప్పడం, దాన్ని ఆసరాగా చేసుకుని మీడియా రకరకాల కథలు అల్లడం తెలిసిందే. అయితే చిరంజీవికి ఇప్పట్లో సినిమా చేసే ఆలోచన లేదన్నది తాజా సమాచారం.

    మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో సినీ రంగ పున:ప్రవేశం చేస్తున్నాడన్న వార్తలు మెగా అభిమానులకు అత్యుత్సాహాన్ని నింపిన తియ్యటి కబురు. అయితే అభిమానులు, నిర్మాతలు, దర్శకులు, కథకలు, హీరోయిన్లు ఇలా అందరిలోనూ చర్చనీయాంశమైన చిరంజీవి మెల్లిగా తన ఇమేజిని కోల్సోతున్న ప్రమాదంలో పడుతున్నట్టు కనిపిస్తోంది.

    రాజకీయం, సినిమా రెండు కళ్ళు అనే మాట ఒక సాధారణ సినిమా ప్రేక్షకుడుగా మాత్రమే అన్నానని, సినిమాలు చూస్తూ కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయదలుచుకున్నానని చిరంజీవి చెప్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయదలుచుకున్నానని, చిరంజీవి చెప్పడం అభిమాన్లుతో తీవ్ర నిరాశను నింపింది. సినిమా చేసే విషయం ఎలక్షన్స్ తర్వాతే చిరంజీవి ఆలోచిస్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. చిరంజీవి అన్న ఈ మాటలకి ఫ్యాన్స్ అవ్వక్కాయరని రాజకీయాల్లోకి వెల్లిన చిరంజీవి మాటలు బాగానేర్చారి కామెంట్స్ వినిపిస్తున్నా. ఇదంతా చూస్తుంటే చిరంజీవి 150వ సినిమా మరుగున పడ్డట్టే. ప్రస్తుతానికైతే లేనట్టేనని తేలిపోయింది.

    English summary
    Chiru may not return to films. His much-hyped 150th film won't be happening, at least not in the next two years. Chiranjeevi himself revealed this at a press meet held in Tirupati. "I never said that I would do a film again, but only wished to honour the aspirations of my fans," he said.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more