ఓ మాస్ మసాలా చిత్రంగా చిరు 150వ’ చిత్రం...!
'బుడ్డా" ప్రీమియర్ షోలో చిరు తన 150వ చిత్రం చేస్తానని మాటిచ్చాడు. అయితే ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం పూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఓ మాస్ తరహాలో ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరు మనసు మళ్లీ మారకముందే..పూరి ఓ కథను సిద్దం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.
అయితే రామ్ చరణ్ కూడా 'కజరారే.." వంటి పాత్రలో డాడీతో కలిసి నటించాలనుందని తెలిపాడు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్నచిరు 150వ చిత్రం ఓ మాస్ మసాలా చిత్రంగా రూపొందనుందని సమాచారం. అదే విధంగా ఈ చిత్రంలో ఓ సమాస్ మసాలా సాంగ్ ద్వారా చరణ్ చిరుతో కలిసి స్టెప్పులు వేయాలనుకున్న కోరిక తీరబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎంతో మంది అభిమానుల కోరిక మేరకు పూరి దర్శకత్వంలో రూపొందనున్ను ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించాడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ చిత్రానికి నిర్మాతతో పాటుగా మిగతా సాంకేతిక వర్గ విశేషాలు అతి త్వరలోనే తెలియనున్నాయి...


Click it and Unblock the Notifications











