Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెన్సేషనల్ డైరెక్టర్ తో చిరు ‘భారతీయుడు సీక్వెల్’....!?
ఒకవిధంగా చెప్పాలంటే ఇది రీమేక్స్ , సీక్వెల్స్ కాలంలా వుంది. కొంతమంది పాత సినిమాలను రీమేక్ చేసే పని మీద పడుతుంటే, మరికొంతమంది సీక్వెల్స్ మీద పడుతున్నారు. తమిళ దర్శకుడు శంకర్ కూడా ఒక సీక్వెల్ చేసే ప్లానింగ్ లో వున్నాడు. 1996 లో కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన 'భారతీయుడు' (తమిళంలో ఇండియన్) సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ 'ఇండియన్ -2' రూపొందించే ఉద్దేశంలో శంకర్ వున్నాడు.
దీని గురించి ఆయన చెబుతూ, 'ఇండియన్ -2" తీద్దామని నిర్మాత ఎఎం రత్నం చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అయితే, ప్రస్తుతం నేను చేస్తున్న నన్బన్ కంప్లీట్ అయ్యాకనే దాని మీద ఓ నిర్ణయం తీసుకుంటాను" అన్నాడు. అవినీతికి వ్యతిరేకంగా సాగే కథ కాబట్టి, ప్రస్తుత సమయంలో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే ఆదరణ ఉంటుందని శంకర్ భావిస్తున్నాడట. మరి, ఇందులో కమల్ నటిస్తాడా? లేక మరెవరైనా నటిస్తారా? అన్నది వేచిచూడాలి..!
రోబో చిత్రం ట్రైలర్ చూస్తుంటే మళ్లీ సినిమాల్లో నటించాలనిపిస్తోంది. నాలోని కళాకారుడు ఈర్ష్యపడేలా ఈ చిత్రం తయారైంది. ఒకవేళ నేను తిరిగి నటిస్తే.. దానికి రోబో చిత్రమే ప్రేరణ!" అని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఒకవేళ శంకర్ సినిమా లో అవకాశం వస్తేనే చేస్తానని ఆ సినిమా దర్శకత్వ బాద్యతలు శంకర్ చేపట్టాలని మనసులోని మాటను బయట పెట్టిన చిరంజీవి అటు వివి వినాయక్, పూరికి చెక్ పెట్టి శంకర్ కి భాద్యలు అప్పగించినా ఆశ్చర్య పో అక్కర్లేదు..
మరి శంకర్ త్రీ ఇడియట్స రీమేక్ 'నన్బన్" పూర్తి కాగానే భారతీయుడు సీక్వల్ చేయడానికి రెడీ. అయితే ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, కరప్షన్ కి వ్యతిరేకంగా 'భారతీయుడు"సీక్వెల్ కు సిద్దం అవుతున్నట్టు సమాచారం. అయితే తెలుగు వర్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించేందుకు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ని తన వైపుకు తిప్పుకొనేందుకు తెగ ప్రయాత్నాలు చేస్తున్నాడని సమాచారం. అదే గనుక జరిగితే ఈ గ్రేట్ కాంబినేషన్ లో రోబో లాంటి మరో సెన్సేషన్ మూవీ ఖాయం అంటున్నారు మెగాఫ్యామిలీ సన్నిహితులు....
కాగా కమల్ హాసన్ ప్రస్తుతం తన 'విశ్వరూపం" చిత్రంలో బిజీ ఉండటంతో తమిళం లో ఈ ప్రాజెక్ట్ ఇప్పుట్లో సెట్స్ కెళ్ళే అవకాశం కనబడుట లేదు. తెలుగు వెర్షన్ లో చిరంజీవి కాలీగా, రెడీగా ఉన్నాడు కాబట్టి శంకర్ స్టేమెంట్ వెలువడేదే తరువాయి.....