ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు.. రిలీజ్ పోస్ట్‌పోన్?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'ఆచార్య'ను మొదటి నుంచీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్‌కి అడుగడుగునా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' మూవీ కారణంగా అనుకున్న దానికంటే ఆలస్యంగా ప్రారంభమైన ఈ మూవీకి ఇప్పుడు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది.
దీంతో ముందుగా అనుకున్నట్లుగా ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అసాధ్యమే అనే టాక్ ముదురుతోంది. ఓ వైపు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించబోయే హీరో ఎవరనే విషయంలో క్లారిటీ రాలేదు. హీరోయిన్ త్రిష తప్పుకోవడంతో ఆ స్థానంలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఇంతలో కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

నిజానికి ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దసరాకు కూడా విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది. దసరాకు కూడా రిలీజ్ చేయలేదంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒకవేళ వచ్చే ఏడాది సంక్రాంతికి దింపాలంటే.. అప్పుడే రామ్ చరణ్, ఎన్టీఆర్ RRR మూవీ రిలీజ్ ఉంది. ఒకేసారి రెండు మెగా హీరోల సినిమాలు విడుదలైతే వారిలో వారికే పోటీ నెలకొంటుంది. సో.. చూస్తుంటే 'ఆచార్య'గా మన మాస్టర్ మరింత ఆలస్యంగా రావొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి చిత్రయూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!.


Click it and Unblock the Notifications











