చిరంజీవి- కొరటాల మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. చివరకు ఇలా ఫిక్స్ అయ్యారు

ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా ఇప్పటిదాకా పెండింగ్ లోనే ఉంది. అయితే చివరకు సెట్స్ పైకి రావడానికి ఓ డేట్ ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. వివరాల్లోకి పోతే..

 బలమైన కథాంశం.. కొరటాల స్టైల్

బలమైన కథాంశం.. కొరటాల స్టైల్

సామాజిక అంశాలను ఎలివేట్ చేయడంలో దిట్ట కొరటాల శివ. ఇటీవలే 'భరత్ అనే నేను' రూపంలో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈయన.. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం బలమైన, ఆసక్తికరమైన కథాంశంతో స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. చిరంజీవి కెరీర్‌లోనే స్పెషల్‌గా నిలిచేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట కొరటాల.

రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్.. సెట్స్ పైకి

రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్.. సెట్స్ పైకి

ఇటీవలే ఈ సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కొరటాల- చిరంజీవి కాంబోను తెరకెక్కించనున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించిన అప్‌డేట్ బయటకొచ్చింది. చిత్రాన్ని డిసెంబర్ 26న సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది.

దేవాలయాల నేపథ్యం.. చిరంజీవి రోల్

దేవాలయాల నేపథ్యం.. చిరంజీవి రోల్

దేవాలయాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం పడుతుందనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని టాక్. ఇక ఈ చిత్రంలో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో చిరంజీవి నటించనున్నాడని తెలుస్తోంది.

 స్టోరీలైన్ ఇదే..

స్టోరీలైన్ ఇదే..

దేవాలయ భూములు, ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేశాడు? ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా స్టోరీలైన్ అని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిషను హీరోయిన్‌గా తీసుకున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు.

గోవిందా హరి గోవిందా

గోవిందా హరి గోవిందా

రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 26న మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే ‘గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని టాక్.

చిరంజీవి లుక్..

చిరంజీవి లుక్..

ఇక ఈ సినిమాలో చిరంజీవి యంగ్ లుక్‌లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇటీవలే చిరంజీవి లేటెస్ట్ లుక్ ఒకటి తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి సెట్స్ మీదకు రాకముందే మెగా 152 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X