ఆచార్య అప్‌డేట్: రామ్ చరణ్ పారితోషికం.. ఈ రేంజ్‌లో సెట్ చేసుకున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'లో రామ్ చరణ్ కూడా భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా తండ్రితో కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకోబోతున్నారు రామ్ చరణ్. ఇందులో ఆయనది అతిథి పాత్రే అయినప్పటికీ చాలా కీలకం కానుందని సమాచారం.
ఈ పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించారని, ఆయనే ఈ రోల్‌లో నటించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహేశ్ బాబుకి రోజుకి కోటి రూపాయలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు కూడా టాక్ బయటకొచ్చింది. కానీ మహేష్ బాబు కాదు ఆ రోల్ రామ్ చరణ్ చేయబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఇందుకు గాను చెర్రీ కూడా సేమ్ డీల్ సెట్ చేసుకున్నారట.

తాను ఎన్ని రోజులు షూటింగులో చరణ్ పాల్గొంటే అన్ని కోట్ల పారితోషం తీసుకునేలా మాట్లాడుకున్నారట. ఇక ఇందులో రామ్ చరణ్ జోడీగా రష్మిక మందన్నను ఫైనల్ చేశారనే మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా చిరంజీవి 152 మూవీ అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి.
మ్యాట్నీ ఎంటెర్టైన్మెట్స్ వారితో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది.


Click it and Unblock the Notifications











