చిరంజీవి ఇంకా తగ్గుతున్నారా? ఈ పరిస్థితికి కారణాలేంటి? మెగా అభిమానుల్లో ఆందోళన!

ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ తన 152వ సినిమా విషయంలో చాలా స్లో అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న మెగా అభిమానుల్లో ఎప్పుడూ నిరాశే నింపుతున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్‌కి ఇంకా చాలా టైమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ ఆలస్యానికి అసలు కారణాలేంటి? వివరాల్లోకి పోతే..

ఆ రోజే అనుకున్నారు కానీ.. అనూహ్యంగా!

ఆ రోజే అనుకున్నారు కానీ.. అనూహ్యంగా!

చిరంజీవి, కొరటాల శివ సినిమాకు ఇటీవలే కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పటి నుంచో జనాల్లో నానుతున్న ఈ సినిమా ఇక సెట్స్ పైకి వస్తుందని భావించారంతా. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 26న సెట్స్ పైకి తీసుకురావాలనుకున్నారు మేకర్స్. కానీ అది జరగలేదు. అనూహ్యంగా మరో నెల పాటు వాయిదా వేశారని వార్తలు వచ్చేశాయి.

కొరటాల స్కెచ్.. 90 రోజుల్లోనే సినిమా

కొరటాల స్కెచ్.. 90 రోజుల్లోనే సినిమా

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాస్త ఆలస్యమైనప్పటికీ అన్ని పనులు సక్రమంగా పూర్తిచేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమా రూపొందించాలని కొరటాల స్కెచ్ వేస్తున్నారట. అదే విధంగా రెగ్యులర్ షూట్ మొదలైన 90 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

మరింత తగ్గనున్న చిరంజీవి

మరింత తగ్గనున్న చిరంజీవి

ఇక ఈ చిత్రంలో క్యారెక్టర్ కోసం చిరంజీవి బరువు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించిన లుక్స్ షాకిస్తుండగా, ఈ నెల రోజుల గ్యాప్ లో చిరు మరింత తగ్గనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన లుక్ కోసమే సినిమా రెగ్యులర్ షూట్ వాయిదా వేస్తూ వస్తున్నారని ఫిలింనగర్ టాక్.

చిరంజీవి రోల్ ఇదే..

చిరంజీవి రోల్ ఇదే..

దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎలాంటి చెడు ప్రభావం పడుతుంది? దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి ఎలా ఉంది? అనేది ఈ సినిమాలో చూపనున్నట్లు టాక్. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు.

చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్

చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్

ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడం, దేవాలయ ఆస్తులను కాపాడడానికి చిరంజీవి చేసే ప్రయత్నాలు ఈ సినిమాలో హైలైట్ సీన్స్ కానున్నాయని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించబోతుందని టాక్. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుంది.

 మెగా 152 టైటిల్..

మెగా 152 టైటిల్..

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. ఇంకొన్ని టైటిల్స్ పరిశీలిస్తున్నప్పటికీ ఇదే ఫైనల్ చేయాలని చూస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X