చిరంజీవితో సై అనేసిన త్రిష.. ఇక అదే తరువాయి!
ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రజెక్టు కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సామాజిక కోణంలో సినిమాలు తెరక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152 తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ బయటకొచ్చింది.
చిరంజీవి- కొరటాల శివ ప్రాజెక్టు మొదలు కాకముందు నుంచే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై పలు వార్తలు షికారు చేశాయి. మరీ ముఖ్యంగా నయనతార, త్రిష పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ చివరకు త్రిష ఫైనల్ అయిందని అంటున్నారు. తాజా సమాచారం మేరకు త్రిషతో కొరటాల శివ చేసిన సంప్రదింపులు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందందని ఫీల్ నగర్ టాక్.

అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేశారు కొరటాల. ఈ సినిమా
పురాతన దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కనుందని అంటున్నారు. ఇక ఇందులో చిరంజీవి లుక్ మెగా అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. షూటింగ్ మొదలుకాక ముందే మెగా 152పై అంచనాలు మిన్నంటాయి. మెగాస్టార్- కొరటాల కాంబోలో సినిమా చూడాలని మహా ఆతృతగా ఉన్నారు ఆడియన్స్.


Click it and Unblock the Notifications











