మెగాస్టార్‌తో మోడ్రన్ బ్యూటీ రొమాన్స్.. ఓకే చెప్పిందట! ఎంత అడిగిందో తెలుసా..?

మెగాస్టార్‌ చిరంజీవి తాజా సినిమా 'ఆచార్య'కు సంబంధించిన అప్‌డేట్స్ అభిమానుల్లో సినిమా పట్ల ఉన్న ఆతృతను పెంచేస్తున్నాయి. త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో సందిగ్దత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా మోడ్రన్ బ్యూటీ కాజల్ ఓకే చెప్పడంతో ఆమెనే ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

మెగా 152.. ట్విస్టుల మీద ట్విస్టులు

మెగా 152.. ట్విస్టుల మీద ట్విస్టులు

చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు మొదటి నుంచీ పలు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట సైరా ఆలస్యం కారణంగా మూవీ ఓపెనింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు అయ్యాక రెగ్యులర్ షూట్‌కి రావడానికి ఎంతో సమయం పట్టింది. తీరా ఇప్పుడు హీరోయిన్ విషయంలో ట్విస్ట్ వచ్చి పడింది.

షాకిచ్చిన త్రిష.. అనుకున్నట్లే జరగవు

షాకిచ్చిన త్రిష.. అనుకున్నట్లే జరగవు

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా త్రిష తప్పుకుంది. ''కొన్నిసార్లు అన్ని మనం అనుకున్నట్లే జరగవు.. మొదటగా చెప్పినదానికి, చర్చలు జరిపిన దానికి తగ్గట్టే అన్ని జరగవు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా.. చిత్రయూనిట్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా'' అని త్రిష అఫీషియల్‌గా చెప్పేసింది.

అనుష్క అనుకున్నాం.. కానీ!!

అనుష్క అనుకున్నాం.. కానీ!!

దీంతో త్రిష ప్లేస్‌లో మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన కొరటాల శివ.. అనుష్క, కాజల్ పేర్లను పరిశీలనలో పెట్టారు. అనుష్క, చిరంజీవితో కలిసి నటించడానికి సుముఖంగా ఉందన్న వార్తలు టాలీవుడ్‌‌లో బాగా వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం కాజల్ పేరే ఖరారైనట్లు తెలుస్తోంది.

కాజల్‌తో సంప్రదింపులు.. ఫైనల్

కాజల్‌తో సంప్రదింపులు.. ఫైనల్

ఇప్పటికే పదేళ్ల కెరీర్ కొనసాగించిన కాజల్.. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో నటించింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆయన 152 మూవీలో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది. చిత్ర దర్శకనిర్మాతలు కాజల్‌తో సంప్రదింపులు కూడా పూర్తిచేసి ప్రాజెక్టు ఫైల్‌పై సంతకం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Vijay Devarakonda Tops Most Desirable Man 2019 | Ram Charan | Prabhas
ఎంత అడిగిందో తెలుసా..?

ఎంత అడిగిందో తెలుసా..?

అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను కాజల్ రెమ్మ్యూనరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేసిందట. పాత్ర పరిధి ఎంతనేది పక్కన పెట్టేసి తనకు రెండున్నర కోట్లు ఇస్తేనే నటిస్తా అని చెప్పిందట. చివరకు ఆమెతో ఒకటిన్నర కోటికి ఓకే చేయించుకున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X