మెగా 153: చివరకు చిరంజీవి ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ చిత్రసీమలో మెగాస్టార్‌గా కీర్తించబడుతూ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో సక్సెస్ సాధించారు. ప్రస్తుతం తన 152 వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు చిరు 153 మూవీ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఆ సినిమా వివరాలేంటో చూద్దామా..

'లూసిఫర్' తెలుగు రీమేక్.. చిరంజీవి ప్లాన్
ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్' సినిమా తెలుగు రీమేక్ రైట్స్ రామ్ చరణ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తమ సొంత బ్యానర్ లోనే ఈ సినిమాను రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాలో తానే హీరోగా చేయాలని చిరంజీవి భావిస్తున్నట్లుగా తాజా సమాచారం.

సుకుమార్ చేతిలో బాధ్యతలు
తన ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యేలా తెలుగులో ఈ కథను మార్చాలని అనుకున్న చిరంజీవి.. ఆ బాధ్యతలను దర్శకుడు సుకుమార్‌కు అప్పజెప్పారట. అయితే మొదట ఆయన కాస్త అటూఇటూగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం లూసీఫర్ రీమేక్ చేయడానికి సుకుమార్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ సినిమా చేస్తుంటే లూసీఫర్ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ పై కసరత్తులు చేయనున్నారట సుకుమార్.

ఆ డైరెక్టర్ అని తెలిసిందే కానీ..
మరోవైపు మెగా 153 సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం మేరకు ఆయన డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో సంప్రదింపులు చేశారని తెలిసింది. కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం హరీశ్ శంకర్ సినిమాను పక్కనపెట్టేసి సుకుమార్ తో లూసిఫర్ రీమేక్ చేసేందుకు చిరంజీవి రెడీ అయ్యారని తెలుస్తోంది.
Recommended Video

కొరటాల- చిరు కాంబో
ఇకపోతే కొరటాల శివ- చిరు కాంబోలో తెరకెక్కుతున్న చిరంజీవి 152 మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫినిష్ కాగానే లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వచ్చేస్తారట చిరంజీవి.


Click it and Unblock the Notifications











