మెగా 153: ఆ డైరెక్టర్‌తో చిరంజీవి చర్చలు.. మూవీ ఫిక్స్! ఇక అభిమానులకు పండగే..

ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలు అందుకుంటున్నారు. కాస్త లేటుగా సినిమా చేస్తున్నా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన 153 సినిమాను కూడా ఓ కమర్షియల్ డైరెక్టర్‌తో ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? మెగా 153 సంగతులేంటి? వివరాల్లోకిపోతే..

చారిత్రాక కథాంశం.. రామ్ చరణ్ నిర్మాణం

చారిత్రాక కథాంశం.. రామ్ చరణ్ నిర్మాణం

గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత రామ్ చరణ్ నిర్మాణంలో తన డ్రీమ్ ప్రాజెక్టు 'సైరా నరసింహా రెడ్డి' చేశారు చిరంజీవి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి మెగా అభిమానులకు కొత్త టేస్ట్ రుచి చూపించింది. అదే జోష్ కంటిన్యూ చేస్తూ మెగా 152 సెట్స్ పైకి కూడా వచ్చేశారు చిరు.

మెగా 152.. కొరటాల స్కెచ్

మెగా 152.. కొరటాల స్కెచ్

మెగా 152 ప్రాజెక్టు కోసం మరో విలక్షణ కథాంశం రెడీ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. సామాజిక అంశాలను ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన ఈ డైరెక్టర్ చిరంజీవి కోసం బలమైన కథ సిద్ధం చేసి సెట్స్ పైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి సూచన.. రంగంలోకి ఆ డైరెక్టర్

చిరంజీవి సూచన.. రంగంలోకి ఆ డైరెక్టర్

ఇదిలా ఉండగానే తన 153వ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించారట చిరంజీవి. ఈ మేరకు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌తో సంప్రదింపులు చేస్తున్నారట. ఇటీవ‌ల చిరంజీవిని కలిసిన హరీష్ ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లుగా ఇన్‌సైడ్ టాక్. ముందుగా చిరు ఇచ్చిన సూచన మేరకే హరీష్ ఈ కథ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

 గడగడలాడించిన డైరెక్టర్.. మెగా క్యాంప్ హీరోలు

గడగడలాడించిన డైరెక్టర్.. మెగా క్యాంప్ హీరోలు

మెగా క్యాంప్ హీరోలతో డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌‌కి మంచి ట్రాక్ రెకార్డ్ ఉంది. ప‌వ‌న్‌తో ‘గ‌బ్బ‌ర్ సింగ్‌', బ‌న్నీతో ‘డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్' సినిమాల‌ను తెర‌కెక్కించి సూపర్ డూపర్ సక్సెస్ సాధించారు హరీష్. ఇక ఇటీవలే వ‌రుణ్‌తేజ్‌తో ‘గద్ద‌ల‌కొండ గ‌ణేశ్' అంటూ గడగడలాడించారు. మరి ఇక చిరుతో సినిమా అంటే ఆయన స్క్రిప్ట్ మామూలుగా ఉంటుందా? మీరే చెప్పండి.

Recommended Video

Megastar Chiranjeevi's Decision Worrying Mega Fans ?
 మెగా శిబిరాల్లో రియాక్షన్

మెగా శిబిరాల్లో రియాక్షన్

ఏదేమైనా చిరంజీవి- డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌‌ కాంబినేషన్ అనే టాక్ రావడమే ఆలస్యం మెగా శిబిరాల్లో ఆనందం తాండవిస్తోంది. చూడాలి మరి ఈ మెగా 153 మూవీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో! ఏ రోజు అఫీషియల్ ప్రకటన చేసి సర్‌ప్రైజ్ చేస్తారో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X