చిరంజీవి షాకింగ్ డిసిషన్.. కొరటాల తర్వాత.. త్రివిక్రమ్ నో ఛాన్స్.. క్రేజీ డైరెక్టర్‌తో

సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే అప్పుడే చిరంజీవి నటించే తదుపరి సినిమాపై ఫిలింనగర్‌లో భారీగా చర్చ జరుగుతున్నది. వాస్తవానికి కొరటాల తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలుండేవి. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా లేనట్టే అనే వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. మాటల మాంత్రికుడి సినిమాను పక్కన పెట్టి మరో క్రేజీ దర్శకుడికి మెగాస్టార్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.

 శరవేగంగా ఆచార్య మూవీ

శరవేగంగా ఆచార్య మూవీ

కొరటాల శివ, చిరంజీవి కలయికలో వస్తున్న సినిమాకు ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కాగా ఈ చిత్ర షూటింగ్ కోకాపేట్‌లో వేసిన భారీ సెట్టింగ్‌లోనూ.. అలాగే రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల లీక్ అయిన చిరంజీవి నక్సలైట్ తరహా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సెట్స్‌పైకి 153 తీసుకెళ్లే

సెట్స్‌పైకి 153 తీసుకెళ్లే

ఇక కొరటాల శివ సినిమాను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తదుపరి సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలను దర్శకులకు ఇస్తున్నారనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి కొరటాల శివ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమాను చిరంజీవి చేయాల్సి ఉంది.

 త్రివిక్రమ్‌కు నో ఛాన్స్

త్రివిక్రమ్‌కు నో ఛాన్స్

కానీ అల వైకుంఠపురం తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఓ సినిమాను చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ నుంచి వచ్చింది. అయితే కొరటాల శివ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల దర్శకుడు సుకుమార్‌తో సినిమాను చేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యారనేది తాజా సమాచారం.

 సుకుమార్‌తో మెగాస్టార్

సుకుమార్‌తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి స్పష్టమైన వైఖరితో ఉండటం, సుకుమార్ కూడా ఆయనతో భేటీ అవ్వడం జరిగిందట. ఈ మధ్యలోనే కథా చర్చలు కూడా వారి మధ్య చోటుచేసుకొన్నాయని... త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెల్లడి అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొనసాగిస్తూనే స్క్రిప్టు పనులు కూడా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తున్నది.

మైత్రీ మూవీస్ రంగంలోకి

మైత్రీ మూవీస్ రంగంలోకి

అయితే చిరంజీవి, సుకుమార్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించనున్నారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో రాంచరణ్‌, సుకుమార్ కాంబినేషన్‌లో రంగస్థలం సినిమాను మైత్రీ రూపొందించి రికార్డు స్థాయి హిట్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైత్రీ మూవీస్, చిరంజీవి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయనేది లేటేస్ట్ న్యూస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X