Acharya: మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు. గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మిగతా సినిమాల నుంచి పోటీ ఎక్కువ కావడంతో సమ్మర్ లో కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి ఏప్రిల్ 29వ తేదీన ఆచార్య సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా భారీ స్థాయిలో అయితే రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేస్తుండగా ఒక వారం కంటే ముందుగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ఇటీవల నిర్మాతలు తెలియజేశారు.

ఇక ఆ ప్లాన్ కు తగ్గట్టుగానే ఏప్రిల్ 24వ తేదీన ఆచార్య రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ అలాగే మరికొంత మంది హీరోలు కూడా హాజరు కాబోతున్నారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తేజ్ పాత్ర 20 నిమిషాలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. సిద్దా అనే నక్సలైట్ పాత్రలో మెగాస్టార్ కు సహాయంగా కొనసాగే వారియర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. టీజర్ కూడా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ఇక ప్రస్తుతం అయితే సినిమా ట్రైలర్ పైనే అందరి ఫోకస్ ఉంది. ట్రైలర్ ను ఈ నెల 14న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఆ విషయంలో కూడా ఓ క్లారిటీ రానుంది. సినిమా విడుదల కంటే ఒక రెండు వారాల కంటే ముందుగానే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా ఆచార్య సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. మరి RRR సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ క్రేజ్ ఆచార్య సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











