twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంటపడుతున్న ‘బుల్లి’-భయపడుతున్న చిరు?

    By Bojja Kumar
    |

    Chiranjeevi
    వెండి తెరపై మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి బెల్లితెర(టీవీ)కి ఆమడ దూరమనే చెప్పాలి. హీరోగా వెలుగొందుతున్న సమయంలో చిరంజీవి టీవీ కార్య్రక్రమాల్లో పెద్దగా కనిపించ లేదు. సినిమాలను వదిలి పెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలు మొదలు పెట్టిన చిరంజీవి...ఇప్పుడు కూడా బుల్లి తెరకు దూరంగానే ఉంటున్నారు. ఇతర రాజకీయ నాయకులంతా బుల్లితెర మీడియా(టీవీ ఛానల్స్)ను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదుగుతుంటే, చిరంజీవి మాత్రం బుల్లితెర పేరు ఎత్తితేనే భయపడి పోతున్నారట.

    కారణం ఏమంటే...టీవీ లైవ్ షోల్లో పాల్గొని శ్రోతలు అడిగి ప్రశ్నలకు, తన తోటి రాజకీయ చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడానికి చిరంజీవికి ఇబ్బంది కావడమే. ఆ మధ్య ఓయూ జేఏసీ నాయకుడు సుమన్ వేసిన ప్రశ్నకు చింజీవి సమాధానం చెప్పకుండానే నిష్క్ర్రమించాడు. అప్పటి నుంచి చిరంజీవి మళ్లీ టీవీ లైవ్ షోల్లో పెద్దగా కనిపించ లేదు. కనీసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న నేపథ్యంలో....ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కూడా చిరంజీవి ప్రయత్నించ లేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఒప్పుకోవాలే గానీ..ఆయనతో లైవ్ షోలు, ఇంటర్యూలు నిర్వహించడానికి దాదాపు 30 వరకు బుల్లి తెర న్యూస్ ఛానల్స్ క్యూలో ఉన్నాయి. కానీ చిరంజీవి భయంతో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.

    రాజకీయ నాయకుడు అనే వాడు ప్రజలతో మమేకమై, వారి అభిప్రాయాలను పాలుపంచుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అందుకు ఎలక్ట్రానిక్ మీడియా మంచి సాధనం. కానీ చిరంజీవి ఆ ఉద్దేశ్యం లేనట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా ఒంటెద్దు పొకడలు పొతున్నాడు కాబట్టే చిరంజీవి రాజకీయాల్లో వెనకబడి పోతున్నాడనే వారు కూడా లేక పోలేదు. మరి ఈ విషయాన్ని చిరంజీవి ఎప్సుడు అర్థం చేసుకుంటారో?

    English summary
    Chiru is afraid of taking part in TV shows, especially to sit as a politician. While tension of T-activists is on one side, on the other hand there are those who suffered due to PRP. Though he is a politician, he can’t take live shows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X