చిరంజీవికీ చోటు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు!

By Bojja Kumar

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా వచ్చిన 'రోబో' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం భారీ విజయం సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది. తాజాగా 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో 2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ చిత్రంపై....రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నారని, తమిళ హీరో అజిత్ ఓ ముఖ్యమైన పాత్ర చేయబోతున్నారనే ప్రచారం సినీ సర్కిల్‌ల్లో మొదలైంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ సినిమా ప్రారంభం కాకముందు ఇలాంటి వార్తల వల్లా పబ్లసిటీ బాగా పెరిగి పోతోంది.

 Chiranjeevi and Ajith in Robot 2

రోబో ఫస్ట్ పార్టులో విలన్ పాత్రలో డానీ నటించారు. ఆ సినిమాలో డానీ రోబో చేతిలో చనిపోతాడు. కాగా 'రోబో 2'లో విలన్ పాత్ర ఎవరు చేయబోతున్నారు? అనే విషయం ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల వచ్చిన ధూమ్ 3 చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అమీర్ ఖాన్....'రోబో 2'లో కూడా విలన్ పాత్ర పోషిస్తాడని బాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో త్వరలో తేలనుంది.

రోబో 2 చిత్రం ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రస్తుతం 'ఐ'(తెలుగులో 'మనోహరుడు') చిత్రం షూటింగులో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత 'రోబో 2' చిత్రంపై దృష్టి సారించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X