మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్.. క్రేజీ రీమేక్ కోసం బన్నీ రంగంలోకి
మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద విజయాన్ని దక్కించుకొన్న చిత్రంగా లూసిఫర్ రికార్డు సృష్టించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవిని విశేషంగా ఆకట్టుకోవడంతో తెలుగులో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
Recommended Video

చిరంజీవికి నమ్మినబంటుగా
మలయాళ చిత్రంలో స్టీఫెన్ పాత్ర ధారి మోహన్‌లాల్‌కు నమ్మిన బంటుగా జాయెద్ అనే పాత్ర ఉంటుంది. ఆ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా పోషించారు. మోహన్‌లాల్ తర్వాత అంతటి ధీటుగా నిలిచే పాత్ర అది. ద్వితీయార్థంలో పృథ్వీరాజ్ పాత్రనే కీలకంగా నిలుస్తుంది. ఫైట్స్, యాక్షన్ సీన్లతో పృథ్వీరాజ్ ఆకట్టుకొన్నారు. ఈ చిత్రంలో కూడా చిరంజీవికి నమ్మిన బంటుగా అల్లు అర్జున్ పోషిస్తే ఫ్యాన్స్‌కు పండుగే అనే మాట వినిపిస్తున్నది.

చాలాకాలంగా ఎదురుచూస్తున్న
అలాంటి పాత్రను స్టైలిష్ స్టార్ అయితే న్యాయం జరుగుతుందనే అభిప్రాయం ప్రస్తుతం మెగా క్యాంపులో వ్యక్తమవుతుందట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ పాత్రను చేయాలనే బలమైన కోరికతో ఉండటంతో అది సాధ్యం కాబోతున్నదనే మాట వినిపిస్తున్నది. ఇదే నిజమైతే.. డాడీ తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్‌కు ఓ రూపం రాబోతున్నదనేది సినీ వర్గాల అభిప్రాయం.

తెలుగు నేటివిటికి అనుగుణంగా
లూసిఫర్‌ను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని, త్వరలోనే ఈ సినిమాపై ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారనేది ఇప్పటికే ఓ వార్త వైరల్ అయింది.

నెలాఖరుకల్లా స్క్రిప్టు రెడీ
మెగాస్టార్ చిరంజీవితో సుజిత్ రెడ్డి చర్చలు జరుపుతూ స్క్రిప్టును ఓ కొలిక్కి తీసుకొచ్చినట్టు సమాచారం. పూర్తిస్థాయి స్క్రిప్టును ఏప్రిల్ చివరికల్లా పూర్తి చేస్తే చిరంజీవి దానికి ఆమోద ముద్ర వేయబోతున్నారట. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి స్వయంగా సినీ జర్నలిస్టులతో చెప్పుకోవడం గమనార్హం. ఏప్రిల్ నెలాఖరుకల్లా ఈ సినిమా కథను సిద్ధం చేయాలని ఓ టీమ్ పనిచేస్తున్నట్టు సమాచారం.

ఆచార్య పూర్తికాగానే లూసిఫర్ తెరపైకి
ఆచార్య మూవీ పూర్తి కాగానే చిరంజీవి లూసిఫర్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆచార్య మూవీ 40 శాతం పూర్తయింది. లాక్‌డౌన్ ఎత్తివేయగానే సినిమాను శరవేగంగా పూర్తి చేయాలనే తపనతో చిరంజీవి ఉన్నారు. జూన్‌లో ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అవుతుందని, లేకపోతే లాక్‌డౌన్ పరిస్థితులు అనుకూలించకపోతే చిరంజీవి జన్మదినం ఆగస్టు 22న సినిమాను డైరెక్టుగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











