Puneeth Rajkumar కోసం రంగంలోకి చిరంజీవి, ఎన్టీఅర్.. ఒకేవేదిక మీద అలా?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఒక స్టార్ అయినప్పటికీ ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టింది. అయితే ఇప్పుడు పునీత్ చివరి చిత్రం "జేమ్స్" మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలవుతోంది. ఆ సినిమాకు ఇప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్ అండగా నిలవనున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

 అండగా టాలీవుడ్

అండగా టాలీవుడ్

గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా బాధ పడిన పరిస్థితి కనిపించింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలు సైతం వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

బాలకృష్ణ అయితే ఏకంగా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు కూడా పాల్గొని వారి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

పునీత్ జయంతి సందర్భంగా

పునీత్ జయంతి సందర్భంగా

కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్ ​కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పునీత్​ రాజ్ ​కుమార్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమా మీద అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యాన్స్​లో అయితే ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

చిరంజీవి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా

చిరంజీవి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను గ్రాండ్​గా ప్లాన్​ చేస్తోంది సినిమా యూనిట్. కన్నడ సినిమా వర్గాల సమాచారం మేరకు ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఘనంగా నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

వారం పాటు

వారం పాటు

చిరంజీవి, ఎన్టీఆర్ లకు కన్నడలో కూడా మంచి క్రేజ్ ఉంది. అదీ కాక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనుండంతో వారిని ఆహ్వానించారని టాక్. ఇక కర్ణాటకలోని ఎగ్జిబిటర్లు రాష్ట్రంలో జేమ్స్ విడుదల అయ్యాక ఆ సినిమా మినహా మరే సినిమాను ఒక వారం పాటు ప్రదర్శించకూడదు అని కూడా నిర్ణయించారు. కిషోర్ పత్తికొండ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఐదు బాషలలో

ఐదు బాషలలో

ఇక 'జేమ్స్' సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. పునీత్​ రాజ్ ​కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు చేతన్​ కుమార్​ దర్శకత్వం వహించగా.. ప్రియా ఆనంద్​ హీరోయిన్​గా నటించారు. అలాగే మన హీరో శ్రీకాంత్ ఆ సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో పునీత్​ రాజ్ ​కుమార్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడిపే వ్యక్తి పాత్రలో నటిస్తారని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X