ఆ యంగ్ హీరో మూవీలో చిరంజీవి, బాలయ్య? ఫ్యాన్స్‌కు పూనకలే

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకున్న నాలుగు స్తంభాల్లో అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ జోడీ కూడా ఒకటి. ఎన్టీఆర్ నట వారసుడిగా బాలయ్య.. సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా చిరంజీవిలు తమ నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ పరిధిని, మార్కెట్‌ను వీరిద్దరూ దశాబ్ధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. 60 ప్లస్‌లోనూ ఈ నట దిగ్గజాలు సినిమాలు చేసుకుంటూ కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి మధ్య సినిమా పరమైన పోటీయే తప్పించి.. వ్యక్తిగతంగా వీరిద్దరూ సోదరుల్లా మెలుగుతారు.

బాలయ్య- చిరు మల్టీస్టారర్ కోసం వెయిటింగ్
ఈ ఇద్దరు లెజెండ్స్‌తో మల్టీస్టారర్ తీయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మంచి కథ దొరికితే మేం ఖచ్చితంగా నటిస్తామని బాలయ్య, చిరులు పలుమార్లు తమ మనసులో మాట బయటపెట్టారు కూడా. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని నందమూరి - మెగా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరో సినిమాలో చిరంజీవి, బాలకృష్ణ కనిపించనున్నారట. ఈ వివరాల్లోకి వెళితే..

Chiranjeevi and Nandamuri Balakrishna Surprise in Thimmarajupalli TV Buzz Around Kiran Abbavaram s Film

నిర్మాతగా కిరణ్ అబ్బవరం
హీరోగా వరుస విజయాలు సాధిస్తూనే, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కేఏ ప్రొడక్షన్స్ పేరుతో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. 90వ దశకం నాటి పీరియాడికల్ డ్రామాగా, గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తిమ్మరాజుపల్లి టీవీ తారాగణం
కేఏ ప్రొడక్షన్స్, సుమైరా స్టూడియోస్ బ్యానర్‌లపై కిరణ్ అబ్బవరం, తేజా వేల్పుచర్ల సంయుక్తంగా తిమ్మరాజుపల్లి టీవీ చిత్రాన్ని నిర్మించారు. సాయితేజ్, వేధా జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా.. వి మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీకాంత్ రేఖానా సంగీతం అందిస్తుండగా.. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

అలనాటి నటుల గెటప్స్‌లో
తిమ్మరాజుపల్లి టీవీకి వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇటవల జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ఈ చిత్రంలో నటించిన వారిని 1990ల నాటి నటీనటుల గెటప్‌లలో వచ్చి ఆకట్టుకున్నారు. నిర్మాత కిరణ్ .. నందమూరి బాలకృష్ట నటించిన చెన్నకేశవరెడ్డి గెటప్‌లో వచ్చి సందడి చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఈ సినిమా యూనిట్ మొత్తం తెలుగు సాంప్రదాయం ప్రకారం పట్టుబట్టల్లో విచ్చేశారు.

బాలయ్య, చిరంజీవిలతో సర్‌ప్రైజ్
తాజాగా ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో ఊహించని సర్‌ప్రైజ్ ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణలు ఈ సినిమాలో తళుక్కున మెరుస్తారట. సినిమా ప్రారంభంలో బాలకృష్ణ ఎంట్రీ ఉండగా.. క్లైమాక్స్‌ను మెగాస్టార్ చిరంజీవితో ముగిస్తారట. దీనికి సంబంధించిన గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య గెటప్స్ కానీ.. వారి సినిమా పోస్టర్లు కానీ, లేదంటే డైలాగ్స్ కానీ ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిదే. మొత్తం మీద తిమ్మరాజుపల్లి టీవీకి హైప్ పెంచేందుకు కిరణ్ అబ్బవరం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X