Don't Miss!
- News
అందుకే సీఎం జగన్ కు అంత క్రేజ్ - తండ్రిని మించి పోయేలా..!!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
మెగా నందమూరి కాంబో: ఎన్టీఆర్ కోసం చిరంజీవి, రామ్ చరణ్.. ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు, హోస్టింగ్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయిన అతడు.. కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే మరో క్రేజీ మూవీని ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

వరుస హిట్లు.. నేషనల్ క్రేజ్
హిట్లు మీద హిట్లు కొడుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

కొరటాల శివతో మరో మూవీ
RRR సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఆ తర్వాత గురూజీని కాదని మరో డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నాడు

ఆలస్యంగా.. గ్లింప్స్‌తో రెడీ
'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతుండడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినా చిత్రీకరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఇది ఉంటుందా? లేదా? అన్న డౌట్లు వచ్చాయి. అప్పుడే చిత్ర యూనిట్ ఓ గ్లింప్స్ వీడియోతో పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది.
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!

వరుస అప్‌డేట్లు.. వాళ్లతో
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ మూవీకి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇస్తున్నట్లు అధికారికంగా మరోసారి ప్రకటించారు. అలాగే, మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. అంతేకాదు, లొకేషన్లు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇక, ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని.. మోహన్‌లాల్, సైఫ్ అలీ ఖాన్‌లు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అప్పుడే ముహూర్తం ఫిక్స్
పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని నిర్మాత ఆఫీసులో పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించి.. ఆ వెంటనే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేలా యూనిట్ ప్లాన్ చేసుకుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

వాళ్ల ఫ్యామిలీలు ఎంటర్
ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న ఎన్టీఆర్ మూవీ పూజా కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తాజాగా బయటకు వచ్చాయి. ఫిలిం నగర్ సమాచారం ప్రకాం.. ఈ వేడుకకు RRR దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి తమ కుటుంబాలతో సహా హాజరు కాబోతున్నారట. అలాగే, కల్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకు హాజరు అవుతాడని తెలిసింది.

ఎన్టీఆర్ కోసం మెగా స్టార్లు
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించబోయే సినిమా పూజా కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన భార్యతో కలిసి హాజరు కాబోతున్నాడట. అంతేకాదు, దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసింది. అంటే.. ఒకే వేదికపై మరోసారి నందమూరి, మెగా హీరోలు సందడి చేయబోతున్నారన్న మాట.