చిరంజీవితో హిందీ రీమేకా?

అయితే ఆ సినిమా రైట్స్ గల యూటీవీ వారు మాత్రం కమల్ హాసన్,ముమ్మట్టిలతో ఈ సినిమా తమిళ,తెలుగు భాషల్లో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని మరో సమాచారం. ఇదంతా ఇలా ఉంటే జెడీ దర్శకత్వంలో ఈ సినిమా హోమం నిర్మాత నిర్మించనున్నాడని ఆ మధ్య ఓ వార్త వచ్చింది. దాన్ని యూ టీవీ వారు కూడా ఖండించారు. ఇక ఈ సినిమాకి చిరంజీవి ఎందుకు చేయాలన్న దానికి ఓ భిన్నమైన వాదన వినపడుతోంది.
అయినా ఈ రీమేక్ పై వచ్చినన్ని వార్తలు,గాసిప్స్ ఈ మధ్య కాలంలో ఏ రీమేక్ పై రాలేదు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో చిరంజీవి మళ్ళీ నటుడుగా చేస్తాడా...అంటే ఇది ఓ పార్టీ ప్రచార చిత్రంగా ఉపయోగించుకోవచ్చునన్న సమాధానం వినపడుతోంది. అలాగే చిరంజీవి చేస్తాడంటున్న నసీరుద్దీన్ షా పాత్ర ఒకే బిల్డింగ్ పై ఎక్కువ సేపు ఉండటంతో షూటింగ్ కి ఎక్కువ కాలం అవసరం లేదని అందుకే చిరంజీవి ఒప్పుకుంటారని అంతా భావిస్తున్నారు.
movies telugu chiranjeevi srihari wednesday mumbai bomb blasts pawan నశీరుద్దీన్ షా శ్రీహరి వెడ్నస్ డే


Click it and Unblock the Notifications