Bhola Shankar: వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్.. అందరివాడుకు మించేలా!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తూ.. జెట్ స్పీడుగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను అందించిన ఆయన.. గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన సొంతమైంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా దక్కాయి. ఫలితంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సాధించింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశారు.
'వాల్తేరు వీరయ్య' కంటే ముందే చిరంజీవి 'భోళా శంకర్' మూవీని మొదలు పెట్టారు. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ దర్శకుడిగా చెడ్డ పేరును తెచ్చుకున్న మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇక, ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

'భోళా శంకర్' మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె లాయర్‌గా చేస్తున్నట్లు ఇటీవలే కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చిరంజీవి - తమన్నా మధ్యన వచ్చే సన్నివేశాలు ఎంతో నవ్వు తెప్పించే విధంగా ఉంటాయట. ముఖ్యంగా కోర్టు సీన్స్ అన్నీ ఓ రేంజ్‌లో కామెడీని పండిస్తాయని తెలిసింది. చిరంజీవి గతంలో 'అందరివాడు' సినిమాలో తనదైన కామెడీని పండించారు. ఇప్పుడు దానికి మించేలా 'భోళా శంకర్'లో సందడి చేస్తారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
క్రేజీ కాంబోలో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











