»   » త్రివిక్రమ్‌పై మెగా ఫ్యామిలీ గుర్రు!

త్రివిక్రమ్‌పై మెగా ఫ్యామిలీ గుర్రు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పార్టీ విషయం తెరపైకి రాగానే మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేస్తుంది ఆయన సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాసే అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అన్నయ్య చిరంజీవికి అస్సలు సహించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న చిరంజీవి ఈ పరిణామాలతో షాకయ్యాడు. తమ్ముడు కొత్తపార్టీ పెట్టడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. దీంతో ఆయన పవన్ పార్టీ వెనక ఉన్న వ్యక్తులపై తన ప్రతాపం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi angry with Trivikram?

పవన్ పార్టీ వెనక ఉన్న వ్యక్తుల్లో ముఖ్యుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌‌పై చిరంజీవితో పాటు ఇతర మెగాఫ్యామిలీ సభ్యులు గుర్రుగా ఉన్నారు. మరి మెగాస్టార్ ఆగ్రహానికి గురైన త్రివిక్రమ్ భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడో? అనే చర్చమొదలైంది. అయితే పవన్ అండ ఉన్నంత కాలం ఏమీ కాదనే మరో వాదన కూడా వినిపిస్తోంది.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే....మరో సోదరుడు నాగబాబు మాత్రం పవన్ కళ్యాణ్‌కు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీని హైటెక్స్, మాదాపూర్లో ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించనున్నారు. సాయంత్ర 6 గంటల నుండి 7 గంటల వరకు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉంటుందని, తాను రాజకీయాల్లోకి రావడానికి గల ఉద్యేశ్యం, లక్ష్యాలను పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించనున్నారు.

English summary

 The mega family feels it is under Trivikram’s direction that Pawan actually decided to go against his brother Chiranjeevi and think of starting a new party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu