చిరు - అనిల్ ప్రాజెక్ట్.. విలన్ గా సెన్సేషనల్ హీరో.. ఎవరంటే?
'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి చివరిగా బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఆ చిత్రం తర్వాత వచ్చిన 'భోళా శంకర్' పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెగాస్టార్ అభిమానులు కాస్తా అప్సెట్ అయ్యారు. ఇక చిరు తన నుంచి రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహించారు. దర్శకుల విషయంలో కాస్తా రూటు మార్చి షాకింగ్ ప్రాజెక్ట్స్ లతో రాబోతున్నారు. పూర్తి యంగ్ డైరెక్టర్స్ కే అవకాశం ఇస్తూ వస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి నుంచి తదుపరి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా మెగా157పై ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉగాది పర్వదినాన 2025 మార్చి 30న ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. దాదాపు సినిమా ఫార్మల్ ఓపెనింగ్ జరిగి నెల కావస్తోంది. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న అనిల్ రావిపూడి త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. ముందుగా సినిమాలోని నటీనటుల ఎంపికను పూర్తి చేస్తున్నారు. తాజాగా చిరుకు విలన్ రోల్ గా యంగ్ హీరోను ఫైనల్ చేసినట్టు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు. RX100 చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ కావడం విశేషం. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇక హీరోగా పలు సినిమాలు చేస్తున్నా ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు. కానీ విలన్ గా మాత్రం వరుస అవకాశాలు అందుకున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. చిరుకు విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త వైరల్ అవుతోంది.
ఇక కార్తీకేయ ఇప్పటికే రెండు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. నేచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాండ్ లీడర్' చిత్రంలో మెయిన్ విలన్ గా కార్తీకేయ అలరించాడు. అతని నటనకు ప్రశంసలు అందాయి. అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'వలిమై' చిత్రంలోనూ నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించాడు. ఆ చిత్రంలో ఏకంగా అజిత్ తో బైక్ రైడ్, స్టంట్స్ చేసి మరీ ఆశ్చర్య పరిచాడు. అయితే హీరోగా కంటే ఇలా విలన్ గానే బాగా క్రేజ్ దక్కించుకుంటున్నాడు కార్తీకేయ. ఈ క్రమంలోనే చిరు - అనిల్ ప్రాజెక్ట్ లోనూ విలన్ గా అవకాశం దక్కిందని అంటున్నారు.
ఇదే నిజమైతే కార్తీకేయ కెరీయర్ మరో మలుపు తిరుగనుందని సినీ పండితులు చర్చించుకుంటున్నారు. చిరవిగా కార్తీకేయ 'భజే వాయు వేగం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మెగా157 ప్రాజెక్ట్ లో విక్టరీ వెంకటేశ్ కూడా కామియో అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సాహు గారపాటి, మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. సంగీత దర్శకుడుగా భీమ్స్ సిసిరోలియో వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











