Mega158: నెవ్వర్ బిఫోర్ రోల్‌లో చిరంజీవి? మెగాస్టార్‌ కోసం బాబీ మాస్టర్ ప్లాన్!

ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లతో చిరు ప్రభంజనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవితో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు రెడీగా ఉన్నారు. బాబీ, శ్రీకాంత్ ఓదెలకు ఇప్పటికే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరిలో బాబీ సినిమాను మెగాస్టార్ ముందుగా సెట్స్ మీదకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి కెరీర్‌లో ఇది 158వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా కథ ఏంటీ? చిరంజీవి ఎలా కనిపించనున్నారు? నటీనటులు ఎవరు? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మెగా 158కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 20న మెగా 158?
గతంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో చిరంజీవిని అభిమానులు చూడాలనుకుంటున్న విధంగా మాస్ గెటప్‌లో చూపించి ట్రీట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. అలాగే మెగాస్టార్‌కు మెమొరబుల్ హిట్ ఇచ్చి అభిమానుల ఆకలి తీర్చారు. వీరిద్దరి కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుండటం, పైగా మన శంకర వరప్రసాద్ గారు తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉండగా.. ఏప్రిల్ 20న మెగా 158 మూవీ అధికారికంగా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Chiranjeevi as Mafia Don in Mega 158 Mumbai Backdrop and High-Voltage Action

2027 సంక్రాంతిన రిలీజ్?
దళపతి విజయ్‌తో జననాయగన్, యష్‌తో టాక్సిక్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, లోహిత్‌లు సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు దేశంలోని ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌ను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

మోహన్‌లాల్ గెస్ట్ రోల్?
మలయాళ సూపర్‌స్టార్, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు మోహన్‌లాల్.. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించనున్నారట. ఇక చిరంజీవి సరసన హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఎంపికైనట్లుగా తెలుస్తోంది. అలాగే చిరంజీవి కూతురిగా మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ నటించున్నారట. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్ర పోషించనున్నారట. చిరంజీవి అభిమానుల కోసం భారీ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉండేలా బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

పవర్‌ఫుల్ రోల్‌లో చిరంజీవి
కాగా.. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా కథగా Mega 158 సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఓ పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా కనిపించనున్నారట. మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ క్యారెక్టర్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సెకండాఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్‌ను బాబీ డిజైన్ చేశారట. ఈ ఎపిసోడ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: chiranjeevi bobby kolli priyamani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X