అందుకే చెర్రీని చిరంజీవి అవాయిడ్ చేస్తున్నాడా?
తన తనయుడు రామ్ చరణ్ తేజను చిరంజీవి కావాలని అవాయిడ్ చేస్తున్నారా? అందుకే రచ్చ ఆడియో ఫంక్షన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అంటున్నారు మెగా కుటుంబం సన్నిహితులు. చిరంజీవి ఇలా ప్రవర్తించడం వెనక రెండు కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంజా ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో పవన్ కు, వారి మధ్య చెడిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే చిరంజీవి మాత్రం తాను బీజీగా ఉండటం రాలేదని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని వివరణ ఇచ్చారు.
తాజాగా రచ్చ ఆడియో ఫంక్షన్ కు కూడా గైర్హాజరు కావడం ద్వారా....తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నాననే కటింగ్స్ ఇవ్వడంతో పాటు, తమ్ముడి సినిమా వేడుకకు రాలేదు, కొడుకు సినిమా వేడుకకు వచ్చాడు అని ఆలోచన తలెత్తకుండా చేసినట్లు అవుతుందని చిరంజీవి భావిస్తున్నాడని అంటున్నారు.
రచ్చ ఆడియో వేడుక మార్చి 11న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. చరన్-తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ ఇందులో మెడికోగా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











