twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiru vs Balayya vs Venky mama: సీనియర్ హీరోల బాక్సాఫీస్ వార్.. ఈ సారి తప్పేట్లు లేదు!

    |

    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు కానీ ఒకప్పుడు టాలీవుడ్ లో నలుగురే అగ్రహీరోలు ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు కొన్నేళ్ళ పాటు ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడు కూడా వీరి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోలే అయినా కూడా ఇప్పటికీ తమ స్టామినా మాత్రం తగ్గలేదని అని నిరూపించుకుంటూసి నిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నలుగురిలో ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఆ నలుగురు

    ఆ నలుగురు

    చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 60 ప్లస్ ఏజ్ సీనియర్ స్టార్ హీరోలు. గతంలో ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ ఉండేది. సంక్రాంతి, దసరా పండుగలకి ఈ సీనియర్ హీరోల సినిమాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడి సత్తా చాటుతూ ఉండేవారు. ఇప్పుడు అంటే లేవు కానీ ఒకప్పుడు సినిమా అంటే 100 రోజులు,150 రోజులు, 200 రోజులు అంటూ థియేటర్స్ లో హంగామా ఉండేది.

    ట్రెండ్ మారింది

    ట్రెండ్ మారింది

    కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది సినిమా రిలీజ్ అయితే ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది అనే అంశం మీద సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే అంశాలను ఫైనల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నా సెకండ్ వేవ్ కారణంగా దాదాపు థియేటర్లన్నీ మూసివేశారు. ఈ నేపథ్యంలో మే నెలలో పోటీ పడాల్సిన సీనియర్ హీరోలు అందరూ దసరాను టార్గెట్ చేశారని అంటున్నారు.

    ఆచార్య చిరంజీవి

    ఆచార్య చిరంజీవి

    నిజానికి ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈ సినిమా మే 13న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కానీ తరువాతి తేదీ ఇంకా ప్రకటించలేదు. ఆగస్టు నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    అఖండ బాలకృష్ణ

    అఖండ బాలకృష్ణ

    మరో పక్క బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ అనే సినిమా కూడా మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇంకా కాస్త మిగిలే ఉంది. కరోనా సెకండ్ వేవ్ కనుక లేకపోతే ఈ పాటికి షూటింగ్ జరిపి మే 28వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతానికి థియేటర్లు మూసివేసి ఉన్న కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా దసరాకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

    నారప్ప వెంకటేష్

    నారప్ప వెంకటేష్

    విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నారప్ప సినిమా కూడా ఈ రోజున అంటే మే 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ వేవ్ లో కనుక లేకపోతే ఈ రోజు రిలీజ్ అయి ఉండేది. ఈ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా కూడా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

    Recommended Video

    Ravi Teja Replaces Chiranjeevi In Puri Jagannadh's Auto Jaani || Filmibeat Telugu
    మిగతావాళ్ళ పరిస్థితి ఏంటో

    మిగతావాళ్ళ పరిస్థితి ఏంటో

    ఇక ఈ విధంగా ముగ్గురు బడా హీరోలు చాలా కాలం తర్వాత దసరా బాక్సాఫీసు రేస్ లో దిగడం ఆసక్తికరంగా మారింది. అయితే మరో పక్క కేవలం సీనియర్ హీరోలు ముగ్గురు దసరాకి వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా సందిగ్ధమే. ఎందుకంటే ఇప్పటికే చిన్న సినిమాల వాళ్ళు సినిమా థియేటర్ ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోలు ఒకేసారి వస్తే మిగతా సినిమా వాళ్ళ వాళ్ళకి థియేటర్లు దొరకడం అంటే కష్టమనే చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో.

    English summary
    As we all know hiranjeevi, Venkatesh Daggubati and Nandamuri Balakrishna are ready with thier respective films for release. According to the latest reports Megastar Chiranjeevi, Venkatesh Daggubati and Nandamuri Balakrishna are going to fight at the box office occasion of this Dusshera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X