twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని కొరటాల ఓ ఆట ఆడిస్తాడట.. సీనియర్ హీరోతో ఎందుకు పెట్టుకుంటున్నాడో

    |

    మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

    'సైరా: నరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరు 'సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది.

     Chiranjeevi Become hockey coach In Koratala Siva Movie

    ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించబోతుందని కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిరు - కొరటాల సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో చిరంజీవి హాకీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. అవును.. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరంజీవికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాను గతంలో బాలీవుడ్‌లో వచ్చిన 'చక్‌దే ఇండియా' సినిమాతో పోల్చేస్తున్నారు.

    'చక్‌దే ఇండియా' భారతీయ సినీ చరిత్రలో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో షారూక్ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అలాగే, ఈ సినిమాలో 'చక్‌దే.. హో చక్‌దే ఇండియా' అంటూ సాగే పాట ఎంతో హిట్ అయింది.

    English summary
    Megastar Chiranjeevi upcoming Movie Sye Raa Narasimha Reddy. After This movie He Starts project With Koratala Siva. Producer Ram charan Take Risk For prestigious Project. In This Movie Chiru Role Is hockey coach.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X