Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవిని కొరటాల ఓ ఆట ఆడిస్తాడట.. సీనియర్ హీరోతో ఎందుకు పెట్టుకుంటున్నాడో
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.
'సైరా: నరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరు 'సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది.
ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించబోతుందని కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిరు - కొరటాల సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో చిరంజీవి హాకీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. అవును.. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరంజీవికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాను గతంలో బాలీవుడ్లో వచ్చిన 'చక్‌దే ఇండియా' సినిమాతో పోల్చేస్తున్నారు.
'చక్‌దే ఇండియా' భారతీయ సినీ చరిత్రలో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో షారూక్ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అలాగే, ఈ సినిమాలో 'చక్‌దే.. హో చక్‌దే ఇండియా' అంటూ సాగే పాట ఎంతో హిట్ అయింది.