twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవే వెనక ఉండి నడిపించాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఇన్నాళ్లూ నార్త్‌లో బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఐఫా అవార్డుల వేడుక తాజాగా సౌత్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24,25 తేదీలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అవార్డుల వేడుక చాలా ఘనంగా జరిగింది తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

    Chiranjeevi behind IIFA shift?

    అయితే హఠాత్తుగా సౌత్ కి వచ్చి మరీ ఐఫా అవార్డ్లు లు వేడుక ఎందుకు జరిపారనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి డౌట్స్ కు మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఐఫా తన వల్లే హైదరాబాద్ కి వచ్చిందని అని చెప్పారు.

    చిరంజీవి మాట్లాడుతూ... ‘కేంద్ర టూరిజం శాఖామంత్రి హోదాలో ఉన్నప్పుడు నేను విదేశాల్లో జరిగిన ఐఫా వేడుకలకి హాజరయ్యాను. అక్కడ ఐఫా యాజమాన్యాన్ని కలసి మా సౌత్ లో ఈ వేడుకలని ఎందుకు జరపకూడదు? అని అడిగాను. అందుకు వాళ్ళు బదులుగా....'త్వరలోనే అక్కడికి వస్తాం అన్నారు'. వాళ్ళు అన్నట్లుగానే ఇప్పుడు వచ్చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న ఇలాంటి అవార్డు వేడుకలు హైదరాబాద్ లోను తరుచుగా జరపాల్సిన అవసరం ఉన్నది' అని చిరు చెప్పారు.

    Chiranjeevi behind IIFA shift?

    రెండు రోజులు జరిగిన ఈ వేడుక సినీ ప్రియులను ఎంతగానో అలరించగా రామ్ చరణ్ , అఖిల్ లు తొలిసారి లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఐఫా వేడుకలో వ్యాఖ్యాతగా ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు అల్లు శిరీష్. సెలబ్రిటీల మీద చక్కటి వ్యంగ్యాస్ర్తాల్ని సంధిస్తూ కార్యక్రమాన్ని ఆసాంతం రక్తికట్టించారు.

    English summary
    Mega Star Chiranjeevi speaking at IIFA awards event as chief guest said it was he who as Union Minister of Tourism made it possible.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X