Megastar Chiranjeevi: "విశ్వంభర" సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ లీక్.. తొలిసారి అలాంటి పాత్రలో!
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే చాలు ఆయన అభిమానులు అంతా పూనకాలతో ఊగపోతుంటారు. ముఖ్యంగా ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇక వాల్లు చేసే హడావుడి ఎలా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చిరు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. విరామం లేకుండా తెగ కష్ట పడిపోతున్నారు. తనకు కథ వచ్చే వరకు వేచి చూసి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఓ అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట కాంబోలో రాబోతున్న చిత్రం విశ్వంభర. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. నెల రోజుక క్రితమే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముఖ్యంగా చిత్రబృందం విడుదల చేసిన ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. పోస్టర్ లో పంచ భూతాలను చూపించి మెగా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేశారు. ఇదంతా చూస్తుంటే ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్నట్లు అర్థం అయిపోయింది.

ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాకు లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. స్టార్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. విశ్వంభర చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎవరు నటిస్తారనే దానిపై ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. కానీ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ రోల్ పేరు కూడా చెబుతున్నారు. అయితే ఈ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ముల్లోకాలకు సంబంధించిన ఈ సినిమాలో చిరంజీవి గోదావరి జిల్లాకు చెందిన వాడిలా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. చిరు 150 చిత్రాల్లో నటించగా.. ఇప్పటి వరకు గోదావరి జిల్లాకు చెందిన వాడిగా మాత్రం కనిపించలేదు. ఇలా మొదటి సారి గోదావరి యాసలో మాట్లాడుతూ రచ్చ చేయబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో చిరంజీవి పేరు దొరబాబు అని ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు అయితే వైరల్ అయ్యాయి.

అలాగే చిరంజీవి పక్కన ఈ సినిమాలో సునీల్ కనిపించనున్నారు. ఆయన కూడా గోదావరికి చెందిన వాడుగానే దర్శనం ఇవ్వబోతున్నాడట. చిరు వెంట ఉండి కామెడీ చేయడంలో సునీల్ ప్రధాన పాత్ర పోషించినట్లు అర్థం అవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత డిఫరెంట్ కథతో చిరు రావడం ఇదే మొదటి సారి. దీంతో అందరిలోనూ విపరీతమైన అంచనాలు మొదలు అయ్యాయి. చూడాలి మరి చిరు ఎలా కనిపిస్తాడనేది.


Click it and Unblock the Notifications











