»   » నాగబాబు కూతురపై చిరు సీరియస్?

నాగబాబు కూతురపై చిరు సీరియస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగబాబు కూతురుకి చిరంజీవి గట్టిగా క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చాడంటూ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం నాగబాబు తన కూతురుని వెంటేసుకుని ఓ పార్టికి హాజరవటమే.కాజల్ కూడా హాజరైన ఆ ఫంక్షన్ లో నాగబాబు కూతురు కాస్త పొట్టి డ్రస్ లు వేసుకుని మోడ్రన్ గా తయారై వచ్చింది. అది ఈనాటి యూత్ కి కొత్త కాకపోయినా మీడియాకు మంచి మేత దొరికినట్లుగా వరస పెట్టి ఆమె ఫోటోలు తీసేస్తూండటంతో నాగబాబు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. అంతేగాక తెల్లారేసరికి నెట్ లో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే కనిపించాయి. దాంతో చిరంజీవి ఆమెను పిలిచి ఇలా ఎప్పుడూ చేయవద్దని తమ కుటుంబం నుంచి వస్తున్న వారిపై అందరి దృష్టి ఉంటుందని చెప్పాడట. అంతేగాక బయిట చాలా జాగ్రత్తగా ఉండమని, తండ్రిని నవ్వులు పాలు చేయవద్దని తన తమ్ముని మీద ప్రేమతో ఆమెకు వార్నింగ్ తరహా క్లాసు పీకాడట. అయితే తన పెదనాన్న ఎదురు చెప్పని ఆమె సైలెంట్ గా బయిటకు వచ్చి తన తండ్రితో పంక్షన్ కి వెళ్ళినందకు తనను తాను తిట్టుకుందిట. ఏదైమైనా సెలబ్రేటీల పిల్లలు అంటే మీడియాకు ఆసక్తే కదా. వాళ్ళే కాస్త జాగ్రత్తగా తమ ఇమోజ్ ని తాము బయిట ప్రపంచానికి ఎలా చూపించాలనుకుంటున్నామో ప్లాన్ చేసుకుని దానికి తగినట్లు బిహేవ్ చేయాలి.

English summary
Chiranjeevi angry on Nagababu's daughter.She attend a function in Short Skirts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu