రామ్ చరణ్ ని డైరక్ట్ చేయాలంటే ఇవీ కండీషన్స్....

By Srikanya

రామ్ చరణ్ రీసెంట్ చిత్రం ఆరెంజ్ డిజాస్టర్ కావటంతో చిరంజీవి తన కుమారుడు భవిష్యత్ ని తనే దగ్గరుండి తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే బడ్జెట్ ఎక్కువ అవుతుందని మెరుపు చిత్రం ఆపుచేయించారు. అంతేగాక ఇప్పుడు చరణ్ సినిమా ఒప్పుకోవాలంటే మొదట చిరంజీవికి కథ చెప్పి ఒప్పించాలి. ఆయన చెప్పిన మార్పులు చేసిన తర్వాతే చిత్రం సెట్స్ కు వెళుతుంది. అలాగే ఇక మాస్ మసాలా సినిమాలనే ఒప్పుకోమని, అప్పుడు సినిమా ప్లాప్ అయినా ఇంత డిజాస్టర్ గా మిగలదని, తన కెరీర్ ని ఉదాహరణగా చెపుతూ క్లాస్ పీకాడని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు చరణ్ తో సినిమా చేద్దామనుకునే దర్శకులు మొదట చిరంజీవిని కలసి కథ చెప్పటానకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఆల్రెడ్ ప్రూవ్ డ్ డైరక్టర్స్ అదీ మాస్ సినిమాలతో ఒప్పించేవారికే ఆ క్యాంప్ లో చోటు దొరకనుంది. అలాగే కథతో పాటు బడ్జెట్ ని స్పష్టంగా ప్రెజెంట్ చేయాలి. అంతే బడ్జెట్ తో తీస్తానని హామీ ఇవ్వగలగాలి. అలాగే తాము చెప్పిన సూచనలను కథలోనూ, షూటింగ్ లోనూ ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇవ్వాలి .ఇదీ చరణ్ కి కథ చెప్పాలంటే కండీషన్స్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X