చిరంజీవి వ్యతిరేకుల ఆనందం!?
శ్రీజ రహస్య ప్రేమ పెళ్లి వార్త సినిమా ఇండస్ట్రీనే కాకుండా రాష్ట్రాన్ని కుదిపివేస్తుంది. ఇపుడు ఈ వార్త దేశ రాజధానికి పాకింది. ఈ పెళ్లి వార్త చిరంజీవి కుటుంబాన్ని షాక్ కు గురిచేయగా సినీ పరిశ్రమలో చాలామందికి సంతోషాన్ని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం బంజారా హిల్స్ లో చాలా మంది ,చాలా బిజీగా ఉండడం ఈ పుకార్లకు బలం చేకూరుస్తోంది. ఒక నటుడి ఇంటిముందు కార్లు ఆగి ఉండడమే కాదు అందులో వచ్చిన వారంతా దాదాపు నాలుగు గంటలు చిరంజీవి కూతురు శ్రీజ విషయం చర్చించుకుటున్నట్లు, అందులో పాల్గొన్నవారందరూ చాలా సంతోషంగా వున్నట్లు ఫిల్మ్ నగర్ భొగట్టా. చిత్ర పరిశ్రమలో చిరంజీవి వ్యతిరేకులంతా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నటులలో ఎవరూ చిరంజీవిని పలకరించిన పాపాన పోలేదని తెలుస్తోంది. దీనికి తోడు శ్రీజ వ్యవహారం ఇంకా ముగియకపోవడం చిరంజీవిని కలవరపెడుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











